Balakrishna : స్టార్ హీరో బాలకృష్ణతో ఎక్కువ సినిమాలు చేసిన ప్రముఖ దర్శకుడు ఎవరో తెలుసా?

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.

 Balakrishna This Is The Director Who Made More Films With Nandamuri Balakrishna-TeluguStop.com

ఇటీవలే భగవంత్ కేసరి ( Bhagavanth Kesari )సినిమాతో ప్రేక్షకులను పులకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం తదుపరి సినిమా పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే బాలయ్య బాబు ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించారు.అందులో కొన్ని ఫ్లాప్ గా కూడా నిలిచాయి.

Telugu Anasuyammagari, Balakrishna, Dharma Kshetram, Kodanda Rami, Tollywood-Mov

అయితే బాలయ్య బాబు కెరియర్ లో ఎక్కువగా ఎవరి దర్శకత్వంలో చేశారు అన్న ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.మరి ఆ వివరాల్లోకి వెళితే.బాలయ్య బాబు ఎక్కువగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో ఎక్కువగా నటించి మెప్పించారు.కోదండరామరెడ్డి దర్శకత్వంలో వచ్చిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు నమోదు చేసాయి.

నందమూరి బాలకృష్ణ,దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్‌ గా పేరు గడించింది.మరి వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల విషయానికొస్తే.నందమూరి బాలకృష్ణ( Balakrishna ) దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం అనసూయమ్మ గారి అల్లుడు( Anasuyamma Gari Alludu _ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.బాలకృష్ణ, ఏ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం భార్గవ రాముడు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది.

Telugu Anasuyammagari, Balakrishna, Dharma Kshetram, Kodanda Rami, Tollywood-Mov

బాలకృష్ణ ఏ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం భానుమతి గారి మొగుడు.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.బాలకృష్ణ ఏ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో చిత్రం తిరగబడ్డ తెలుగుబిడ్డ.బాలకృష్ణ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ఐదో చిత్రం రక్తాభిషేకం.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్‌గా నిలిచింది బాలకృష్ణ దర్శకుడు ఏ.

కోదండరామిరెడ్డి కాంబినేషన్‌( kodanda ramireddy )లో తెరకెక్కిన ఆరో చిత్రం భలే దొంగ.బాలకృష్ణ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ఏడో చిత్రం నారీ నారీ నడుమ మురారి.ఈ చిత్రం బాక్పాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.

బాలకృష్ణ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో ఎనిమిదో చిత్రం ధర్మక్షేత్రం.బాలకృష్ణ దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన తొమ్మిదో చిత్రం నిప్పురవ్వ.ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.ఈ సినిమాలతో పాటు బొబ్బిలి సింహం, మాతో పెట్టుకోకు, ముద్దుల మొగుడు యువరత్న రాజా వంటి సినిమాలలో కూడా నటించి మెప్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube