హీరో వెంకటేష్, నేచురల్ స్టార్ నాని ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
హీరో విక్టరీ వెంకటేష్( Venkatesh ) ఇప్పటికి అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.మరొకవైపు హీరో నాని( Nani ) కూడా వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.
ఇటీవలె దసరా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాని ఇప్పుడు హాయ్ నాన్న( Hi Nanna ) సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు.ఈ సినిమా రేపు అనగా డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ఇద్దరు హీరోలకు సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే హీరో వెంకటేష్ అలాగే నాని ఇద్దరి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయట.
ఇంతకీ ఆ పోలికలు ఏమిటి అన్న విషయానికొస్తే.వీరిద్దరూ యాక్టింగ్ తో నవ్వించడం ఏడిపించడం లాంటివి చేస్తూ ఉంటారు.
ఇలా వీరిద్దరిలో చాలా కామన్ పాయింట్స్ ఉన్నాయి.ఇద్దరు వారి వారి నటనతో ప్రేక్షకులను ఏడిపించడం నవ్వించడం ఎమోషనల్ అయ్యేలా చేయడం ఇద్దరికీ సాధ్యమే.
కాగా ఇప్పుడు ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ తో కొత్త సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఇద్దరు హీరోలు.

నాని హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా వెంకటేష్ సైంధవ్ సినిమాతో( Saindhav ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అలా ఈ రెండు సినిమాలు ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో రాబోతున్నాయి.దీంతో ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ ని ఒకటిగా నిర్వహిస్తూ వెంకీ, నాని కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు.ఈ ఇంటర్వ్యూలో వెంకటేష్, నానితో మాట్లాడుతూ.ఎమోషన్ సీన్స్ చేయడం కొందరు హీరోలకు మాత్రమే బాగుటుంది.

ఇతర హీరోలు ఏడిపించే సీన్స్ చేస్తే ఆడియన్స్ కూడా అంగీకరించలేరు.కానీ మనం ఇద్దరం ఎమోషనల్ సీన్స్( Emotional Scenes ) చేస్తే ఆడియన్స్ కి నచ్చుతుంది.ఇది మనకి ఒక బహుమతి అని చెప్పుకొచ్చారు.దీనికి నాని బదులిస్తూ.మన ఇద్దరిలో కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి సార్.కామెడీ, ఎమోషన్, మాస్ ఈ మూడింటిలో మిమ్మల్ని అంగీకరించినట్లే నన్ను కూడా అంగీకరించారు.
ఇది మన ఇద్దరికీ ఉన్న గొప్ప వరం” అంటూ పేర్కొన్నారు.ఈ సందర్భంగా వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







