శరీరంలో ఐరన్ శాతం ఎప్పుడైతే పడిపోతుందో హిమోగ్లోబిన్ తగ్గడం మొదలవుతుంది.అప్పుడే మీరు రక్తహీనత( Anemia ) బారిన పడతారు.
రక్తహీనత అనేది అనుకున్నంత చిన్న సమస్య ఏమీ కాదు.రక్తహీనత పారిన పడ్డారు అంటే మరెన్నో జబ్బులను ఆహ్వానించినట్లే అవుతుంది.
అందుకే రక్తహీనతను తరిమి కొట్టాలి.అందుకు ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల జ్యూసులు గ్రేట్ గా సహాయపడతాయి.
ఈ జ్యూసులను డైట్ లో చేర్చుకుంటే రక్తహీనత వెనక్కి చూడకుండా పరిగెడుతుంది.మరి ఇంతకీ ఆ జ్యూసులు ఏంటి.
వాటిని ఎలా తయారు చేసుకోవాలి.అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బొప్పాయి, క్యారెట్ జ్యూస్.( Papaya carrot juice )శరీరానికి అవసరమయ్యే ఐరన్ కంటెంట్ ను చేకూరుస్తుంది.ఒక కప్పు బొప్పాయి ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలతో పాటు రెండు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ రెడీ అవుతుంది.రోజుకు ఒకసారి ఈ బొప్పాయి క్యారెట్ జ్యూస్ ను తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి చాలా వేగంగా బయటపడవచ్చు.

అలాగే గ్రీన్ ఆపిల్ కివీ పాలకూర జ్యూస్( Green Apple Kiwi Lettuce Juice ) కూడా రక్తహీనతను తరిమి కొట్టడానికి తోడ్పడుతుంది.ఒక కప్పు గ్రీన్ ఆపిల్ ముక్కలు ,ఒక కివీ పండు ముక్కలు, మూడు పాలకూర ఆకులు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే జ్యూస్ రెడీ అవుతుంది.ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే శరీరానికి అవసరమయ్యే ఐరన్ అందుతుంది.హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.ఫలితంగా రక్తహీనత దూరం అవుతుంది.ఇక లాస్ట్ బట్ నాట్ లిస్ట్.
బీట్ రూట్ జ్యూస్( Beet root juice ).ఒక బీట్ రూట్ ను పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసి వాటర్ తో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆపై స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకుని ఎలాంటి స్వీట్నర్ యాడ్ చేయకుండా తీసుకోవాలి.ఇలా చేసినా కూడా రక్తహీనత పరార్ అవుతుంది.