ఇవివి సత్యనారాయణ ( E.V.V Satyanarayana )డైరెక్షన్ లో శ్రీకాంత్ హీరోగా రచన హీరోయిన్ గా వచ్చిన కన్యాదానం సినిమా( Kanyadaman movie ) చాలా పెద్ద హిట్ అయింది.ఈ సినిమా అప్పట్లో సూపర్ సక్సెస్ సాధించిన సినిమా గా చరిత్ర సృష్టించింది.
ఇక అదే కాకుండా ఫ్యామిలీ సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.అయితే ఈ సినిమాని మొదటగా ఇవివి సత్యనారాయణ నాగార్జున తో చేద్దామనుకున్నాడు కానీ నాగార్జున( Nagarjuna ) ఆ స్టోరీని విని రిజక్ట్ చేయడంతో అప్పుడు ఆయన శ్రీకాంత్ తో సినిమా చేశారు.

ఇక శ్రీకాంత్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.అలాగే పెళ్లి సందడి తర్వాత శ్రీకాంత్( Srikanth ) కెరియర్ లో వచ్చిన మరో భారీ హిట్ గా నిలిచింది.ఇక ఇప్పటివరకు శ్రీకాంత్ చేసిన సినిమాల్లో టాప్ టెన్ సినిమాలను తీస్తే అందులో ఈ సినిమా కూడా చోటు సంపదించుకుంటుంది అనడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఈ సినిమాతో పాటుగా శ్రీకాంత్ ఇవివి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి.

వీళ్లది అప్పట్లో బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి.ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన చాలా సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి… ముఖ్యంగా చాలా బాగుంది, ఆమె, మా నాన్న కి పెళ్లి లాంటి సినిమాలు ఇవివి డైరెక్షన్ లో శ్రీకాంత్ హీరోగా వచ్చి సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.ఇక ఇప్పుడు శ్రీకాంత్ కోటబొమ్మాళి సినిమాతో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి శ్రీకాంత్ ని తీసుకోవచ్చు.ఇక ఇప్పుడు శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే లీడ్ క్యారెక్టర్లు కూడా చేస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు దూసుకు వెళ్తున్నాడు…ఇక ఇప్పుడు దేవర, గేమ్ చెంజర్ సినిమాల్లో కూడా నటిస్తూ శ్రీకాంత్ ఫుల్ బిజీ గా మారిపోయాడు…
.