రాజన్న సిరిసిల్ల జిల్లా :దోపిడి చేసిన కేసులో ఒక్కరికీ మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు 500 రూపాయాల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళ వారం తీర్పు వెలువడిoచారు.ప్రాసిక్యూషన్ కథనం మేరకు.23 జనవరి 2023 రోజున చిన్న లింగపూర్ గ్రామానికి చెందిన ఏనుగు కమలమ్మ అను ఆమె ప్రభుత్వ దవాఖాన నేరెళ్ళ కు వెళ్లి దవాఖాన లో చూపించుకుని చిన్న లింగాపూర్ కు వెళ్ళుటకు నేరెళ్ల దవాఖాన ముందు ఒంటరిగా నిలబడి ఉండగా అందజ 12.30 సమయం లొ గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్ పై తన వద్దకు వచ్చి మాటమాట కలిపి నీ కొడుకు నాకు బాగా పరిచయం మీ ఇంటి వద్ద దింపుతనని తెలుపగా ఆమె అతని మాటలు నమ్మి అతని బండిపై ఎక్కగా అతను తన ఇంటికి తీసుకువచ్చాడు.ఇంటికి తీసుకువచ్చినాడు తనతో మంచిగా మాట్లాడుతూ అందాజ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆ వ్యక్తి తన పెన్షన్ డబ్బులు పెంచుతానని తనకు మాయమాటలు చెప్పి దానికి గాను ఆమె ఆధార్ కార్డు,బ్యాంకు ఖాతా బుక్కు ఇవ్వాలని కోరాగా అతను మాటలు నమ్మి వాటిని తీసుకురావడానికి బెడ్ రూమ్ లోకి వెళ్తుండగా ఆ వ్యక్తి తన మెడలో గల రెండు తులాల పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని ఆమెను చంపుతానని బెదిరించి ఇంట్లో ఉన్న 10000 రూపాయలు కూడా ఎత్తుకు వెళ్ళినాడని అడ్డుపడిన ఆమెను నెట్టివేసి పారిపోయడు.ఎత్తుకు వెళ్ళిన పుస్తెలతాడు విలువ అందాదా నలభై వేల రూపాయల వరకు ఉంటుందని తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దోపిడీ చేసిన అల్లేపు కృష్ణను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి విచారణ అనంతరం విచారణ అధికారి ఉపేందర్ సిఐ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశాడు ప్రాసిక్యూషన్ తరుపున పి .పి చలుమల్ల సందీప్ వాధించగ కోర్టు మానిటరింగ్ ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ పబ్బ తిరుపతి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.కేసు పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితునికి 3 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్షతోపాటు 500 రూపాయలు జరిమానా విధించారు.







