మద్రాస్ కేఫ్ ( Madras Cafe )అనే హిందీ సినిమా ద్వారా నటన రంగంలోకి, మనం సినిమాలో చిన్న పాత్ర తో తెలుగు లోకి, ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా హీరోయిన్ గా మొదటిసారి పరిచయం అయ్యింది రాశి ఖన్నా( Rashi Khanna ).ఈ సినిమా వచ్చి దశాబ్ద కాలం గడిచిన కూడా రాశి తన క్యూట్ లుక్స్ తో, నటన తో ప్రేక్షకులలో మంచి డిమాండ్ ని ఏర్పరుచుకొని ఫ్యాన్ బేస్ కూడా సంపాదించుకుంది.2012 నుంచి నేటి వరకు రాశి ఖన్నా ఏకంగా 30 సినిమాల్లో తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళ భాషల్లో నటించింది.కానీ ఎందుకో ఒక్క సరైన గట్టి హిట్ ఆమె ఖాతాలో అయితే లేదు.
కథల ఎంపికలో పొరపాట్లు చేసిన రాశి సరైన సినిమాల్లో అయితే నటించ లేకపోయింది.
ఇక రాశి ఖన్నా ప్రస్తుత విషయానికి వస్తే ఆమె గత రెండేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎక్కడ కనిపించలేదు.అందుకు కారణాలు ఏమైనా కానీ ఇన్ని రోజులుగా ఇంతకు ముందు ఎన్నడూ కూడా గ్యాప్ తీసుకోలేదు.ఆమె తెలుగు లో చివరగా నటించిన సినిమా నాగ చైతన్య సరసన థాంక్ యూ( Thank you movie ).ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమాకు కూడా ఆమె సంతకం చేయలేదు.కానీ ఈ గ్యాప్ లో ఏకంగా రెండు తమిళ్ సినిమాలు చేసింది.2022 లోనే అవి కూడా విడుదల అయ్యాయి.అయితే 2023 లో ఆమె నటించిన ఏ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు.
ఈ ఏడాది నాలుగు సినిమాలకు సైన్ చేసిన అవి వచ్చే ఏడాది లోనే విడుదల కానున్నాయి.
మొదట అరణ్మణై 4 వ( Aranmanai 4 th ) సినిమాలో ఆమె నటిస్తుంది.ఈ సినిమా మూడవ భాగం లో రాశి నటించింది.దాని తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా సరసన హీరోయిన్ గా యోధా అనే సినిమాలో నటించింది.
మేథావి అనే మరొక తమిళ సినిమాతో పాటు ఒక హిందీ సినిమా కూడా పూర్తి చేయగా ఈ నాలుగు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయి.అయితే సౌత్ లో కెరీర్ ముగిసి పోతున్న ఈ టైం లో ఆమె హిందీ లో బాగా పాపులర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది.
ఇక మరో వైపు తమిళులకు రాశి బొద్దుగా ఉంటుంది కాబట్టి బాగా నచ్చేసింది.ఎటొచ్చి తెలుగు వారికే చూసి చూసి బోర్ కొట్టి మరొక ప్రాజెక్ట్ ఇవ్వడం లేదు.
లేదంటే ఆమెకు తెలుగు సినిమా కథలు పెద్దగా నచ్చకపోయి ఉండే ఛాన్స్ ఉంది.