ఖలిస్తాన్ వేర్పాటువాది, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూ ( Gurupatwant Singh Pannu )హత్యకు కుట్ర జరిగిందంటూ కొద్దిరోజుల క్రితం అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.దీనిని అమెరికా భగ్నం చేసినట్లుగా ఈ కథనం పేర్కొంది.
అయితే పన్నూ హత్యకు కుట్రలో నిఖిల్ గుప్తా అనే వ్యక్తి ప్రమేయం వుందంటూ ఇటీవల అమెరికా అటార్నీ కార్యాలయం ( US Attorney’s Office )స్పష్టం చేసింది.యూఎస్ అధికారుల ప్రకారం.
పన్నూను హత్య చేయడానికి ఒక హంతకుడుకి $100,000 చెల్లించడానికి నిఖిల్ అంగీకరించాడు.ఈ ఏడాది జూన్ 9న $15,000 అడ్వాన్స్‌గా చెల్లించారు.
సిక్కులకు ప్రత్యేక దేశం కావాలని గళమెత్తుతోన్న భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడి హత్యకు కుట్ర జరిగిందని ఆరోపించింది.ఈ మేరకు భారత్ నుంచి నిందితుడికి ఆదేశాలు అందాయని యూఎస్ న్యాయశాఖ పేర్కొంది.
కానీ ఈ ప్రకటనలో మాత్రం పన్నూ పేరును నేరుగా ప్రస్తావించలేదు.మరోవైపు నిఖిల్ అరెస్ట్, తదితర అంశాలపై భారత్ స్పందించింది.
నిఖిల్‌కు తమ దేశం నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని, అమెరికా వద్ద దీనిపై ఎలాంటి ఆధారాలు లేవని భారత ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి.అలాగే నిఖిల్ గుప్తాకు న్యాయ సహాయం అందిస్తామని తెలిపాయి.

ఈ వ్యవహారం ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచేలా వుండటంతో అమెరికా అధినాయకత్వం రంగంలోకి దిగింది.అధ్యక్షుడు జో బైడెన్‌కు( President Joe Biden ) జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న వైట్‌హౌస్ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు జోన్ ఫైనర్ .గురుపత్వంత్ సింగ్ పన్నుపై హత్యాయత్నానికి సంబంధించిన అంశంపై చర్చించేందుకు భారత్‌కు వచ్చారు.ఫైనర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ‘‘క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీపై ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఇండియా ఇనిషియేటివ్ (ఐసీఈటీ)లో సాధించిన పురోగతిని భారత డిప్యూటీ భద్రతా సలహాదారు విక్రమ్ మిస్త్రీతో( Vikram Mistry ) సమీక్షిస్తారని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.

అమెరికాలో ప్రమాదకరమైన కుట్రలను పరిశోధించడానికి భారత్ ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని, బాధ్యులుగా తేలిన ఎవరినైనా జవాబుదారీగా వుంచాల్సిన అవసరాన్ని ఫైనర్ అంగీకరించారు.సోమవారం ఆయన భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో( Ajit Doval ) సమావేశమయ్యారు.ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంతో సహా మధ్యప్రాచ్యంలో పరిణామాలు, యుద్ధానంతరం గాజాలో పరిస్ధితులు, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై ఇటీవల చోటు చేసుకున్న దాడులపై ఫైనర్ చర్చించినట్లుగా వైట్‌హౌస్ ప్రకటించింది.







