‘‘భారత్’’ అంటే అర్ధం ఇదే .. విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు

‘‘భారత్’’( bharath ) అంటే స్వాతంత్ర్య ప్రకటన అన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్( External Affairs Minister Dr S Jaishankar ).‘‘భారత్’’ కోసం సమగ్ర విధానాన్ని నిర్మించాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.

 Bharat Is A Statement Of Independence Mea Jaishankar Emphasises Building Strong-TeluguStop.com

సోమవారం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నిర్వహించిన ‘‘నాలెడ్జ్ ఇండియా విజిటర్స్ ప్రోగ్రామ్’’లో జైశంకర్ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా వివిధ డొమైన్‌లలో ‘‘భారత్’’ అనే పదం గురించి వివరిస్తూ ముందుకు సాగారు.

రాజకీయాలు, భాషాపరమైన సూక్ష్మ నైపుణ్యాలకు అతీతంగా ‘‘భారత్’’ ఆర్ధిక ప్రాముఖ్యతను కలిగి వుందన్నారు.ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’( Atmanirbhar Bharat ) భావనతో స్థితిస్థాపకత, స్వయం సమృద్ధి, ప్రతిభను ప్రతిబింబిస్తుందని విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.

Telugu Bharat, Externalaffairs, Knowledgeindia, Mea Jaishankar-Telugu NRI

అభివృద్ధిపరంగా ‘‘భారత్’’ అంటే అందరినీ కలుపుకొని, న్యాయమైన సమాజాన్ని సృష్టించే నిబద్ధత అన్నారు.ఎవరూ వెనుకబడిపోకుండా చూసుకోవడం, అభివృద్ధికి నిజమైన పరీక్ష అని జైశంకర్ పేర్కొన్నారు.రాజకీయంగా ప్రపంచంతో భారత్ అనేక బాహ్య ఫ్రేమ్‌‌వర్క్‌లకు ఖచ్చితంగా కట్టుబడి వుండాల్సిన అవసరం లేదన్నారు.దేశ లక్షణాలు, ప్రత్యేక వ్యక్తిత్వ లక్షణాలను ప్రకాశింపజేయాలని భారత్ ధృవీకరిస్తున్నట్లు జైశంకర్ చెప్పారు.

మన సొంత వ్యక్తిత్వం, లక్షణాలు బయటకు రావడానికి ఇది వీలు కలిపిస్తుందన్నారు.

Telugu Bharat, Externalaffairs, Knowledgeindia, Mea Jaishankar-Telugu NRI

సాంస్కృతికపరంగా భారత్ .భాషలు, సంప్రదాయాలు, వారసత్వం, అభ్యాసాలను కలిగి వుంటుందని జైశంకర్ గుర్తుచేశారు.అంతర్జాతీయ సంబంధాలలో సంప్రదాయ అంచనాలను ధిక్కరిస్తూ కీలకమైన క్షణాలలో ముందుకు సాగే స్నేహితుడైన ‘‘విశ్వామిత్ర’’గా భారత్‌ను ప్రపంచం చూస్తోందని జైశంకర్ పేర్కొన్నారు.

ప్రపంచ వేదికపై భారతదేశ పాత్రను ప్రతిబింబిస్తూ.ఇటీవల విజయవంతంగా నిర్వహించిన జీ20 అధ్యక్ష పదవిని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.లోతుగా విభజించబడిన ప్రపంచం మధ్య సామరస్యం వుండే సంస్కృతిని చూపుతూ.తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణాల మధ్య అంతరాలను పూడ్చడంలో భారతదేశ సామర్ధ్యాన్ని జైశంకర్ నొక్కిచెప్పారు.

భారతదేశ భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని చేపట్టిన ప్రణాళికలను కూడా ఆయన వివరించారు.‘‘అమృత్ కాల్ : 25 ఏళ్ల ప్రణాళిక ’’ దీనిలో ఒకటన్నారు.చారిత్ర సవాళ్లను పరిష్కరించడం, అంతర్జాతీయంగా ముఖ్యమైన స్థానంలో వుండటంపై ఇది దృష్టి సారించిందని జైశంకర్ తెలిపారు.కాగా.ఐసీసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ‘‘నాలెడ్జ్ ఇండియా విజిటర్స్’’ ప్రోగ్రామ్ డిసెంబర్ 4 నుంచి 6 వరకు ఢిల్లీలో 80 మంది విద్యావేత్తలు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ సబ్జెక్ట్‌లను బోధించే విభాగాల అధిపతులను ఒకచోట చేర్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube