శనగ పంట సాగును ఆశించే ఆస్కోచ్యాట ఎండు తెగుళ్లను నివారించే చర్యలు..!

శనగ పంట ప్రధాన పప్పు ధాన్యాల పంటలలో ఒకటి.నల్ల రేగడి నేలలలో అధిక విస్తీర్ణంలో సాగు అవుతోంది.

 Measures To Prevent Ascochyta Dry Pests In Chickpeas Cultivation Details, Ascoc-TeluguStop.com

శనగ పంటకు( Chickpea Crop ) శ్రమ చాలా తక్కువ కాకపోతే చీడపీడల, తెగుళ్ల బెడద కాస్త అధికంగానే ఉంటుంది.ఈ శనగ పంటను శీతాకాలపు పంటగా చెప్పుకోవచ్చు.

సెప్టెంబర్- అక్టోబర్ నెలలో భూమిలో తేమస్థాయిని బట్టి సాగును చేపడతారు.

నేలను వేసవికాలంలో లోతు దుక్కులు దున్ని, నేలలో ఇతర పంట విశేషాలను పూర్తిగా శుభ్రం చేయాలి.

ఆ తర్వాత పొలంలో నీరు నిల్వ ఉండకుండా పొలాన్ని చదును చేసుకోవాలి.తెగులు నిరోధక సర్టిఫైడ్ కంపెనీ విత్తనాలను( Certified Seeds ) ఎంపిక చేసుకోని సాగు చేపట్టాలి.

అలా కాకుండా సాధారణ శనగ విత్తనాలు అయితే విత్తన శుద్ధి చేసుకుని సాగు చేపట్టాలి.అప్పుడే కొన్ని రకాల తెగుళ్ల బెడద కాస్త తక్కువగా ఉంటుంది.

Telugu Aschochyta, Ascochyta Dry, Certified Seeds, Chickpeas-Latest News - Telug

శనగ పంటకు ఆస్కోచ్యాట ఎండు తెగుళ్ల( Ascochyta Dry Pests ) బెడద కాస్త ఎక్కువ.ఈ తెగుళ్లు ఒక ఫంగస్ వల్ల పంటను ఆశిస్తాయి.ఈ ఫంగస్ పంట అవశేషాలలో సంవత్సరాల తరబడి జీవించి ఉండగలదు.అనుకూల పరిస్థితులలో ఈ ఫంగస్ బీజాంశాలను ఉత్పత్తి చేస్తుంది.గాలి లేదా వర్షం వల్ల ఈ బీజంశాల వ్యాప్తి జరిగి, ఏకంగా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది.ఈ తెగుళ్లు పంటను ఆశిస్తే మొక్కల ఆకులపై నీటిలో నానినట్టు ఉండే మచ్చలు ఏర్పడతాయి.

Telugu Aschochyta, Ascochyta Dry, Certified Seeds, Chickpeas-Latest News - Telug

ఆ మచ్చలు క్రమంగా గోధుమ రంగులోకి మారతాయి.మొక్క ఏ దశలో ఉన్నా కూడా ఈ తెగులు పంటను ఆశిస్తాయి.ఈ తెగులు ఆశిస్తే మొక్కలు చివరికి ఎండిపోతాయి.ఈ తెగులను కేవలం రసాయన పద్ధతిలో మాత్రమే నివారించగలం.విత్తనాలను థైరం తో విత్తన శుద్ధి( Seed Purification ) చేయాలి.పంట పుష్పించే దశకు ముందు ఈ తెగులను పిచికారి మందుల సహాయంతో వృద్ధి చెందకుండా నిరోధించవచ్చు.

రసాయన పిచికారి మందులైన మాంకొజెబ్, ట్రియాజోలిన్దియోన్ లలో ఏదో ఒక దానిని మొక్క పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube