Sandeep Vanga Atlee: ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప డైరెక్టర్..సోషల్ మీడియాలో పెద్ద సంఘర్షణ

సినిమాకు సంబందించినంత వరకు డైరెక్టర్ మాత్రమే కెప్టెన్.ఆయన చెప్పిందే అల్టిమేట్ డెసిషన్.

 Sandeep Reddy Vanga Vs Atlee Who Is Great-TeluguStop.com

ఆ తర్వాత హీరో, నిర్మాత అంటూ పలువురు ఆడ్ అవుతారు కానీ సినిమాను నిలబెట్టాలి అంటే అది దర్శకుడు వల్లే అవుతుంది.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ మాత్రమే కాదు ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ వారు కూడా ఒక విషయం గురించి బాగా మాట్లాడుకుంటున్నారు.

అదేంటంటే తెలుగు నుంచి వచ్చిన సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) గొప్ప దర్శకుడా ? లేదంటే తమిళ్ నుంచి వచ్చిన అట్లీ( Atlee ) గొప్ప డైరెక్టరా అని.ఈ ప్రశ్న సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా తలెత్తుతుంది.మామూలుగా డైరెక్టర్లు అంటేనే వారు ఇప్పటి వరకు ఎవరు తీయని ఒక కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కొత్త రకమైన మేకింగ్ తో సినిమాను తీసి ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకోవాలని తాతలాడుతూ ఉంటారు.

Telugu Animal, Arjun Reddy, Atlee, Bollywood, Jawan, Kabir Singh, Panindia, Sand

అందుకే ఈ ఇద్దరి దర్శకులు కూడా సౌత్ ఇండియా నుంచి వెళ్లి ప్రస్తుతం బాలీవుడ్ లో పాగా వేశారు. జవాన్ సినిమాతో( Jawan Movie ) అట్లీ షారుక్ ఖాన్ తో సినిమా తీసి 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టగా, అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమా సక్సెస్ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లోకి వెళ్లి కబీర్ సింగ్( Kabir Singh ) అనే సినిమాను తీసి ఆ తర్వాత ఇప్పుడు ఆనిమల్ సినిమాతో( Animal Movie ) అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.అయితే ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప డైరెక్టర్ అంటే చెప్పడం చాలా కష్టం.

ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ తను రాసుకున్న కథను వైలెంట్ గా చూపించి ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందుతుంటే అట్లీ మాత్రం తన అన్ని సినిమాలను కమర్షియల్ గానే సక్సెస్ చేసుకుంటూ వెళుతున్నాడు.

Telugu Animal, Arjun Reddy, Atlee, Bollywood, Jawan, Kabir Singh, Panindia, Sand

తను తీసిన రాజా రాణి సినిమా నుంచి నేటి జవాన్ వరకు అట్లీ అన్నీ కమర్షియల్ సినిమాలు తీసి విజయాలు దక్కించుకున్నాడు.కానీ సందీప్ రెడ్డివంగా తీసిన మూడు సినిమాలు కూడా వయిలెన్స్ చిత్రాలు కావడం విశేషం.వీరి ఇద్దరి స్టైల్ వేరు తీసే పద్ధతి వేరు ఎంచుకుంటున్న కథలు కూడా వేరు అందుకే ఇద్దరినీ ఒకరితో ఒకరు పోల్చడం కష్టం.

కానీ సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకోవడం మాత్రం మన సౌత్ ప్రేక్షకులు చేసుకున్న అదృష్టమని చెప్పాలి.ఇక ముందు ముందు కూడా వీరు మంచి కథలతో బాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా గొప్ప సినిమాలు తీయాలని అందరూ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube