ప్రస్తుత కాలంలో ప్రేమ వివాహాలు జరగడం సర్వసాధారణం అయింది ఎంతోమంది ప్రేమ వివాహం చేసుకొని జీవితంలో ముందుకు వెళ్లడం మరికొందరు తమ ప్రేమలకు బ్రేకప్ చెప్పుకుంటున్నారు.ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీలు కూడా అదే స్థాయిలో ప్రేమ వివాహాలు చేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.
ఎంతో మంది సినీ సెలెబ్రేటీలో ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకుని సంతోషంగా ఉండగా మరికొందరు విడాకులు తీసుకుని విడిపోతున్నారు.అయితే కొంతమంది మాత్రం నిశ్చితార్థంతోనే తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకుంటున్నారు.మరి ప్రేమించుకొని నిశ్చితార్థం (Engagment ) జరుపుకొని తర్వాత విడిపోయినటువంటి ఆ సినీ సెలెబ్రెటీలు ఎవరు అనే విషయానికి వస్తే.
అఖిల్ – శ్రీయ భూపాల్:
అక్కినేని నాగార్జున వారసుడిగా అఖిల్ (Akhil) ఇండస్ట్రీకి వచ్చారు అయితే ఈయన డిజైనర్ శ్రియ భూపాల్ (Shriya Bhupal) అనే అమ్మాయిని ప్రేమించారు.ఇలా కొంతకాలం పాటు ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట అనంతరం పెద్దలకు ప్రేమ విషయాన్ని తెలియజేసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు.ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య,అఖిల్ శ్రియ భూపాల్ నిశ్చితార్థపు వేడుకలు ఒకేసారి జరిగాయి అయితే నిశ్చితార్థం జరిగిన తర్వాత కొంతకాలానికి అఖిల్ శ్రీయ బ్రేకప్ చెప్పుకొని క్యాన్సిల్ చేసుకున్నారు.
శ్రియ భూపాల్ మరొక బిజినెస్ నన్ను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు అఖిల్ మాత్రం ఇంకా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి పోరాటం చేస్తున్నారు.
రష్మిక -రక్షిత్ శెట్టి:
కన్నడ సినీ నటులు రక్షిత్ శెట్టి (Rakshit Shetty) రష్మిక (Rashmika) ఇద్దరు కూడా కిరిక్ పార్టీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డ వీరిద్దరూ పెద్దలను ఒప్పించి ఎంతో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు.అయితే ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి రష్మికకు సినిమా అవకాశాలు రావడంతో వీరిద్దరూ కూడా తమ నిశ్చితార్థాన్ని బ్రేకప్ చేసుకొని కెరియర్ పరంగా సినిమాలలో బిజీగా ఉన్నారు.
ఉదయ్ కిరణ్ -సుస్మిత:
ఉదయ్ కిరణ్ (Uday Kiran) ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో చిరంజీవి తన పెద్ద కుమార్తె సుస్మిత( Sushmitha ) ను ఉదయ్ కిరణ్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు.ఈ క్రమంలోని వీరిద్దరికి ఎంతో ఘనంగా నిశ్చితార్థం కూడా చేశారు.అయితే ఏమైందో తెలియదు కానీ వీరిద్దరికి బ్రేకప్ జరగడంతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని సుస్మిత మరొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
త్రిష -వరుణ్ మణియన్:
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి త్రిష( Trisha ) ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ (Varun) అనే వ్యక్తితో నిశ్చితార్థం జరుపుకున్నారు.అయితే పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలంటే వరున్ ముందుగానే కండిషన్లు పెట్టడంతో త్రిష బ్రేకప్ చెప్పుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నారు.