బిగ్ బాస్ సీజన్ 7 ( Bigg boss 7 ) అంత ఉల్టా పల్టాగా సాగుతుంది.ఈ సీజన్లో ఎలిమినేట్ అవుతారని ఒకరిని ఊహిస్తే మరొకరు ఎలిమినేట్ అయ్యి అందర్నీ షాక్ కి గురిచేస్తున్నారు.
ఇక 13వ వారం డాక్టర్ బాబు గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కృష్ణ ( Gautham Krishna ) ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ యాజమాన్యం నుండి ఓ న్యూస్ లీక్ అవుతుంది.మరి గౌతమ్ కృష్ణ 13 వారాలకి ఎన్ని లక్షలు సంపాదించారో ఇప్పుడు తెలుసుకుందాం.
వృత్తిపరంగా డాక్టర్ అయినప్పటికీ సినిమాల్లోకి రావాలనే ఉద్దేశంతో హీరోగా ఒక సినిమాలో చేసిన గౌతమ్ కృష్ణ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే కాస్త నేగిటివిటీ మూట కట్టుకున్నారు.అంతేకాదు ప్రతిసారి అబద్ధపు మాటలు చెప్పడం,శివాజీ తో గొడవ పెట్టుకోవడం ఆయనపై నెగిటివ్ ముద్ర వేశాయి.
ఏదైనా విషయం చెబితే దానిపై స్టాండ్ తీసుకోకుండా మాట మార్చడం వంటి వాటిని నాగార్జున చాలాసార్లు వీకెండ్లలో చూపించారు.ఇక హౌస్ లోకి వచ్చాక శుభశ్రీ ( Subhashree ) తో కాస్త లవ్ ట్రాక్ నడిపించినప్పటికీ వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ పూర్తిగా నడవకముందే శుభ శ్రీ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది.ఇక గౌతమ్ కూడా ఎలిమినేట్ అయినట్లే అయి సీక్రెట్ రూంలో ఉంచి ఆ తర్వాత మళ్లీ ఆయనను హౌస్ లోకి పంపించారు.ఇక హౌస్ లోకి రావడం రావడమే అశ్వద్ధామ 2.0 అంటూ చాలా బిల్డప్ లు ఇచ్చారు.
ఇక ఇటు సీరియల్ బ్యాచ్ తో కాస్త సన్నిహితంగా ఉన్నప్పటికీ ఆట మాత్రం ఇండివిజువల్ గా ఆడుకునేవాడు.అయితే గత కొద్ది రోజుల నుండి ప్రతివారం శివాజీ ( Shivaji ) పై ఏదో విధంగా నెగెటివిటీ చూపడంతో ఈయనకు బిగ్ బాస్ ప్రేక్షకులు తక్కువ ఓట్లు వేసినట్టు తెలుస్తోంది.ఇక ఈవారం నామినేషన్స్ లో అమర్ తప్ప మిగిలిన ఏడుగురు ఉన్నారు.
ఇక ఈ 13వ వారం గౌతమ్ కృష్ణ హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.అయితే 13 వారాలకు గాను గౌతమ్ కృష్ణ ( Gautham Krishna ) రోజుకు 25 వేల చొప్పున వారానికి 1,75,000 అంటే 13 వారాలకి గాను 22, 75,000 రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది.
అయితే ఈయన తీసుకున్న రెమ్యూనరేషన్ మిగతా వారితో పోలిస్తే తక్కువ అని ఆయన అభిమానులు భావిస్తున్నారు.ఇక హౌస్ నుండి ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణ ఖచ్చితంగా ప్రియాంకకి సపోర్ట్ చేస్తారని, తన అభిమానులందరినీ ప్రియాంకకే ఓట్లు వేయిస్తారని ఈ లెక్కన ఓటింగ్ మొత్తం తారుమారయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది