తెలంగాణ కౌంటింగ్ కి ముందు కేటీఆర్ ఆసక్తికరమైన కామెంట్..!!

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్( Telangana Elections Counting ) మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు.

 Ktr Interesting Comment Before Telangana Counting Details, Telangana Elections,-TeluguStop.com

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి( Congress ) అనుకూలంగా వచ్చాయి.మరోపక్క బీఆర్ఎస్ పార్టీకి( BRS ) చెందిన వాళ్లు తాము అధికారంలోకి వస్తామని… ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తలకిందులు అవుతాయని వ్యాఖ్యానిస్తున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా కౌంటింగ్ కి ముందు మంత్రి కేటీఆర్( Minister KTR ) సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేశారు.

హ్యాట్రిక్ లోడింగ్ 3.0 సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి” అని ట్వీట్ చేయటం జరిగింది.దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్లు.

కేటీఆర్ కామెంట్ పట్ల చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతున్నారు.సీఎం కేసీఆర్( CM KCR ) సైతం గెలుపు పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అంతేకాదు డిసెంబర్ 4వ తారీఖు మొదటి క్యాబినెట్ మీటింగ్ అని కూడా ప్రకటించడం జరిగింది.ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకుల సైతం తామే అధికారంలోకి వస్తామని అంటున్నారు.

ఈ రకంగా ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు.మరి తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కట్టారో.

మరి కొద్ది గంటల్లో తెలియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube