Sandeep Vanga Rashmika: రష్మిక కు ఆనిమల్ సినిమాలో అందుకే అవకాశం ఇచ్చాను : సందీప్ రెడ్డి వంగా

సందీప్ రెడ్డి వంగా…( Sandeep Reddy Vanga ) ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ కాదు.బాలీవుడ్ కాదు దేశం మొత్తం సంచలనం సృష్టిస్తోంది.

 Sandeep Reddy Vanga About Rashmika-TeluguStop.com

మొదట అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు సందీప్.ఆ తర్వాత అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా సక్సెస్ కొట్టాడు.

కానీ ఇప్పుడు రణబీర్ సింగ్, రష్మిక మందన హీరో హీరోయిన్స్ గా ఆనిమల్( Animal Movie ) అనే సినిమాకి దర్శకత్వం వహించి తన పవర్ ఏంటో బాలీవుడ్ కి తెలిసి వచ్చేలా చేసాడు ఈ తెలుగు దర్శకుడు.తాజాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెబితే అది చాలా చిన్న విషయమే అవుతుంది.

ఎందుకంటే అభిమానులంతా కూడా ఈ సినిమా చూసి బయటకు వచ్చి చెబుతున్న మాట ఒకటే ఒకటి ఈ సినిమా మ్యాడ్ లాగ ఉంది అని.

Telugu Animal, Arjun Reddy, Ranbir Kapoor, Rashmika Animal, Sandeepreddy, Sandee

సినిమా అంటే ఇదిరా అనే విధంగా ఆనిమల్ సినిమా ఉందని రణబీర్ సింగ్( Ranbir Singh ) కెరియర్ లోనే ఇది అత్యధిక మైలేజ్ ఉన్న సినిమా అని, కలెక్షన్స్ కూడా వెయ్యి కోట్లు దాటే అంచనా ఉందంటూ ప్రతి ఒక్కరు ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నారు.సరే.సినిమా గురించి, రివ్యూ సంగతి గాని ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు కానీ ఈ సినిమాకి రష్మికను( Rashmika Mandanna ) ఎందుకు హీరోయిన్ గా తీసుకున్నారు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న.ఎందుకంటే రష్మిక మరియు విజయ్ దేవరకొండ ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.అలాగే సందీప్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ రెడ్డి చిత్రంలో( Arjun Reddy ) విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అప్పటి నుంచి సందీప్, విజయ్ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు.

Telugu Animal, Arjun Reddy, Ranbir Kapoor, Rashmika Animal, Sandeepreddy, Sandee

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఏర్పడిన వీరి స్నేహమే ఇప్పుడు రష్మికకు ఆనిమల్ సినిమాలో అవకాశం వచ్చేలా చేసింది అనేది టాలీవుడ్ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.రష్మికను బాలీవుడ్ లో బిజీ చేయాలని విజయ్( Vijay Devarakonda ) తనకు ఉన్న అన్ని కాంటాక్ట్స్ వాడుతున్నాడని అందుకే ఆమెకు ఆనిమల్ సినిమాలో అవకాశం వచ్చిందని ఈ సినిమా విజయం సాధించడంతో రష్మికకు బాలీవుడ్ వరస ఆఫర్లు ఇస్తుందని అంతా భావిస్తున్నారు.ఏది ఏమైనా ఈ విషయంపై సందీప్ రెడ్డి కూడా స్పందించాడు తనకు ఈ పాత్ర చక్కగా సూట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఇచ్చాను దానిపై ఎవరి ప్రభావం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube