టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీ( T20 World Cup 2024 )లో 20 జట్లు పాల్గొంటాయని అందరికీ తెలిసిందే.ఆఫ్రికా క్వాలిఫైయర్ 2023 లో భాగంగా నవంబర్ 30వ తేదీన రువాండా వర్సెస్ ఉగాండా మధ్య జరిగిన మ్యాచ్ తో ప్రపంచ కప్ 2024 టోర్నీలో పాల్గొనే 20 జట్లు ఏవో తేలిపోయాయి.
రువాండాపై విజయం సాధించిన ఉగాండా తొలిసారి ప్రపంచకప్ కు అర్హత సాధించింది.
ప్రపంచ కప్ 2024 టోర్నీలో పాల్గొనే 20 జట్లలో 12 జట్లు నేరుగా అర్హత సాధించాయి.మిగిలిన 8 జట్లు ఆయా రీజియన్ల క్వాలిఫైయర్ మ్యాచ్ల ద్వారా ప్రపంచ కప్ కు అర్హత సాధించాయి.ప్రపంచ కప్ అతిధ్య దేశాలైన USA, వెస్టిండీస్ జట్లతో పాటు.గత ఎడిషన్ లో టాప్-8 లో నిలిచిన ఇంగ్లాండ్, పాకిస్తాన్, భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్.టీ20 ర్యాంకింగ్స్ లో ఆ తర్వాత స్థానాల్లో నిలిచిన ఆఫ్గనిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ జట్టు( Afghanistan , Bangladesh ) నేరుగా ప్రపంచకప్ కు అర్హత సాధించాయి.</br
మిగిలిన 8 దేశాలైన ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్( Scotland ), కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా, ఉగాండ జట్లు తమ రీజియన్ల క్వాలిఫైయర్ మ్యాచ్ల ద్వారా ప్రపంచ కప్ కు అర్హత సాధించాయి.టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీ 2024 జూన్ 4 నుంచి జూన్ 30వ తేదీ వరకు యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరుగనుంది.యూఎస్ఏ లోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ నగరాలలో.కరేబియన్ దీవులలో ఉండే ఆంటిగ్వా అండ్ బర్పుడా, బర్బా డోస్, డొమినియా, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సంట్ అండ్ ద గ్రెనడైన్స్ నగరాలలో ఈ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ మ్యాచులు జరుగనున్నాయి.