Animal Twitter Review : బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యావత్ సినీ ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో ”యానిమల్” ఒకటి.మరి ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ఈ రోజు రిలీజ్ కు రెడీ అయ్యింది.
పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 1న అంటే ఈ రోజు భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ( Sandeep Reddy Vanga ) తెరకెక్కించడంతో ఈ సినిమాపై మన తెలుగు ప్రేక్షకులు సైతం ఇంట్రెస్ట్ గా ఎదురు చూసారు.
బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటించిన ‘యానిమల్’ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది.

ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్స్ కూడా పడగా ఫ్యాన్స్ ఈ సినిమాను వీక్షించారు.మరి సినిమాను చూసిన ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉంది? రణబీర్ కు ఎలాంటి హిట్ దక్కింది? సందీప్ రెడ్డి వంగ ఎలా తెరకెక్కించాడు? అనే విషయాలను ట్విట్టర్ ( Animal Twitter Review ) వేదికగా పంచుకున్నారు.ఆ రివ్యూస్ ను ఒక్కసారి పరిశీలిస్తే.

ఈ సినిమా సందీప్ రెడ్డి వంగ మార్క్ లోనే ఉందని అన్ని అంచనాలను మించేలా అద్భుతంగా తెరకెక్కించాడని అంటున్నారు.ఫస్ట్ 15 నిముషాలు మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు అని ఇంటర్వెల్ ఫైట్ సీన్ కూడా అద్భుతంగా నెక్స్ట్ లెవల్లో ఉందని కామెంట్స్ వచ్చాయి.అంతేకాదు బాలీవుడ్ లోనే ఇది బెస్ట్ సినిమా అని రణబీర్ కపూర్ నటన అద్భుతం అని మరో నెటిజెన్ కామెంట్ చేసాడు.ఇక మూడు గంటలు అయినా సినిమా ఏమాత్రం బోర్ అనేది లేకుండా తీసాడు అంటూ వంగపై కూడా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి.
మొత్తానికి ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసేలానే ఉంది.కాగా ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందించగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మించారు.








