తెలంగాణను ఇచ్చింది కాంగ్రెసే అని రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ( Congress party )కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ హస్తం నేతలు ఈ ఎన్నికల్లో సెంటిమెంట్ ను రాజేశారు.ఈసారి కాంగ్రెస్ కు ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో అని విధాల గట్టిగానే ప్రయత్నించారు హస్తంనేతలు.
ఇక మిగిలింది ఫలితాలే.మరి హస్తం నేతలు ఆశించినట్లుగా ప్రజలు ఒక్క ఛాన్స్ ఇస్తారా అనేది డిసెంబర్ 3న తేలిపోనుంది.అయితే ఇదే ఒక్క ఛాన్స్ నినాదంతో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఒక్క ఛాన్స్ నినాదం అందుకొని కనీవిని ఎరుగని విజయాన్ని నమోదుచేశారు.
ఏకంగా 151 సీట్లను వైసీపీకి కట్టబెట్టారు ఏపీప్రజలు.అదే విధంగా తెలంగాణలో కూడా జగన్ స్ట్రాటజీనే అమలు చేసింది హస్తంపార్టీ.కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలనే నినాదాన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎన్నికల బరిలో నిలిచారు హస్తంనేతలు.గత తొమ్మిదేళ్ల కాలంలో కేసిఆర్ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారని, కుటుంబ పాలన సాగించారని, ధరణి, కాళేశ్వరం వంటి వాటిలో కేసిఆర్ విస్తృతంగా అవినీతికి పాల్పడ్డారని.
కేసిఆర్ పాలనకు స్వస్తి పలికెలా కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని హస్తం నేతలు చెబుతూవచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతామని గట్టిగా చెబుతున్నారు.కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీల అమలు ప్రమాణస్వీకారం రోజే జరుగుతుందని కూడా చెబుతున్నారు.ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ కు ఒక్కచాన్స్ ఇవ్వాలనేది హస్తం నేతలు చెబుతున్నా మాట.అయితే ఈ ఒక్క ఛాన్స్ అనే మాట వైసీపీకి ( YCP )విజయాన్ని తీసుకొచ్చినట్లుగా కాంగ్రెస్ కు కష్టమే అనేది చాలమంది అభిప్రాయం.కాంగ్రెస్ పార్టీలో గుంపు రాజకీయం జరుగుతుందని ఆ పార్టీని నమ్మితే నట్టేటా మునగడం ఖాయం అనే భావన చాలమందిలో ఉంది.
ఈ నేపథ్యంలో హస్తం పార్టీ వినిపిస్తున్న ఒక్కఛాన్స్ నినాదానికి ప్రజల నుంచి ఎంతవరకు మద్దతు లభించిందో తెలయాలంటే డిసెంబర్ 3 వరకు ఎదురుచూడాల్సిందే
.