ముఖ్యంగా చెప్పాలంటే బీట్రూట్( Beetroot ) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.దీని జ్యూస్ తాగితే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి.
అలాగే రక్తహీనతతో బాధపడేవారు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.అలాగే చర్మ సమస్యలతో ఉన్నవారు కూడా బీట్రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.
అయితే బీట్రూట్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కచ్చితంగా బీట్రూట్ కు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
మరి ఎవరు బీట్రూట్ కు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే తక్కువ రక్తపోటు సమస్యతో( blood pressure problem ) బాధపడేవారు దీన్ని తినకుండా ఉండడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే కిడ్నీ సమస్యలతో ( kidney problems )బాధపడేవారు కూడా బీట్రూట్ ను తినకూడదు.అలాంటివారికి కిడ్నీ స్టోన్స్ ప్రమాదం పెరుగుతుంది.
ఇంకా చెప్పాలంటే చంటిపిల్లలకు ఈ దుంపలతో చేసిన రసాన్ని అసలు ఇవ్వకూడదు.పాలు ఇచ్చే తల్లులు, గర్భిణీ మహిళలు బీట్రూట్ దుంపలను తినకపోవడమే మంచిది.
అలాగే క్యాన్సర్ ( Cancer )వ్యాధిగ్రస్తులు కూడా ఈ దుంపలతో చేసిన ఏ ఆహార పదార్థాలను అయినా తినకూడదు.
ఇంకా చెప్పాలంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా బీట్రూట్ దుంపలన్ని తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.అలాగే కొంతమందికి ఈ బీట్రూట్ దుంపలు తింటే ఎంతో అలర్జీ ఉంటుంది.అలాంటి వారు కూడా ఈ దుంపలను తినకూడదు.
ఈ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు బీట్రూట్ దుంపలను తింటే వీరి అనారోగ్య సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీలైనంతవరకు బీట్రూట్ దుంపలకు దూరంగా ఉండటమే మంచిది.