క్రమం తప్పకుండా అల్లం ని వంటకాలలో ఉపయోగిస్తే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

ముఖ్యంగా చెప్పాలంటే అల్లం( Ginger ) నొప్పికి సహజ నివారణగా పని చేస్తుంది.గొంతు నొప్పి, జలుబు నుంచి వెంటనే ఉపశమనాన్ని అందించే అల్లన్ని ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

 Are There So Many Health Benefits Of Using Ginger Regularly In Recipes , Healt-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే గర్భధారణ సమయంలో కొందరు మహిళలలో మార్నింగ్ సిక్‌నెస్, వికారం ఉంటుంది.ఈ పరిస్థితి నుంచి ఉపశమనాన్ని పొందడానికి అల్లం ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

కొన్ని అధ్యయనాల ప్రకారం కాబోయే తల్లులకు అల్లం పూర్తి సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా ఇది గర్భవతులలో వాంతులతో సహా అసౌకర్య లక్షణాలన్నీ దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

క్యాన్సర్ డయాబెటిస్ తో పోరాడుతున్న వారికి దీర్ఘకాలిక మంట వేధిస్తోంది.

Telugu Inflammatory, Arthritis, Ginger, Tips, Knee Pain, Sore Throat-Telugu Heal

అయితే అల్లం లో ఉండే 6-జింజెరాల్ వంటి సమ్మేళనాలు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఈ మంట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.అలాగే వాపును కూడా దూరం చేస్తాయి.అల్లం లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు( Anti-inflammatory properties ) కండరాల, కీళ్ల నొప్పులను తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి.

అల్లం మోకాళ్ళ నొప్పులను( Knee Pain ) కూడా దూరం చేస్తుంది.అలాగే తక్కువ దుష్ప్రభావాలతో ఆర్థరైటిస్ లక్షణాలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.బరువును తగ్గించడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది.ఇన్సులిన్ నిరోధకత వంటి అంశాలను ఇది మెరుగు పరుస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని శతాబ్దాలుగా అల్లాన్ని జీర్ణ క్రియ కు సహాయం చేయడానికి ఉపయోగిస్తున్నారు.

Telugu Inflammatory, Arthritis, Ginger, Tips, Knee Pain, Sore Throat-Telugu Heal

ఇది కడుపు ఖాళీ చేయడాన్ని వేగవంతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే అతి బరువును( Weight Loss ) దూరం చేసుకోవడంలో కూడా అల్లం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.ఇంకా చెప్పాలంటే అల్లాన్ని వివిధ రూపాలలో వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటాము.

మసాలా లాగా, టీలలో, సప్లిమెంట్ గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు.అల్లం ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా ఉపయోగిస్తే కొన్ని చిన్న చిన్న దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని పనులు చెబుతున్నారు.

కొన్ని రకాల మందులు వాడేవారు అలాగే గర్భిణీలు అల్లం ఉపయోగించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube