చలికాలంలో ఈ ఆకుకూరలు తింటే.. వ్యాధులన్నింటిని..!

సాధారణంగా చలికాలం ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండవచ్చు.కానీ ఆరోగ్యపరంగా మాత్రం అది అసలు మంచిది కాదు.

 If You Eat These Vegetables In Winter All Diseases , Health , Health Tips, I-TeluguStop.com

చలికాలంలో మనిషి శరీరంలోని ఇమ్యూనిటీ ( Immunity )పడిపోవడం వలన వివిధ రకాల సీజనల్ వ్యాధులు వస్తాయి.అయితే ఈ పరిస్థితి నుండి బయట పడాలంటే చలికాలంలో డైట్ జాగ్రత్తగా తీసుకోవాలి.

ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.శీతాకాలం వచ్చిందంటే వృద్ధులు, చిన్నారులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి.

ఎందుకంటే చలిగాలుల వలన ఇమ్యూనిటీ పడిపోవడం వలన జ్వరం, జలుబు( Fever cold ), దగ్గుతో పాటు టైఫాయిడ్, మలేరియా,డెంగ్యూ లాంటి వ్యాధులు దాడి చేస్తాయి.అలాగే ఆస్తమా రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఎందుకంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేయవచ్చు.

Telugu Cough, Denguem, Greens, Tips, Immunity, Malaria, Palakura, Red Spinach, T

ఇవన్నీ సమస్యల నుండి బయట పడాలంటే ముఖ్యంగా ఆకుకూరలు తీసుకోవడం మంచి ప్రత్యామ్నాయం.చలికాలంలో ఆకుకూరలు( Greens ) వివిధ రకాల వ్యాధులను కాపాడేందుకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.ఇందులో ముఖ్యమైనవి ఆవ ఆకులు.

అయితే ఆవాకుల్లో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, మినరల్స్, ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు వలన గుండె సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి.అలాగే మలబద్ధకం, మధుమేహం, కామెర్లు లాంటి వ్యాధుల నుండి కూడా రక్షణ కల్పిస్తాయి.

చలికాలంలో ఎక్కువగా తీసుకోవాల్సినది కొత్తిమీర.ఇందులో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు, బీపీ, నియంత్రిత గుణాలు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉంటాయి.

అందుకే కొత్తిమీరను రోజువారి డైట్ లో భాగంగా చేసుకుంటే నాడీ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

Telugu Cough, Denguem, Greens, Tips, Immunity, Malaria, Palakura, Red Spinach, T

అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా దూరమవుతాయి.చలికాలంలో లభించే మరో ఆకుకూర కూడా ఎర్ర బచ్చలి.( Red Spinach ) ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం లాంటి పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి.

ఇక మెంతికూర గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ b6, విటమిన్ సి, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం లాంటివి ఉంటాయి.ఇవి బ్లడ్ షుగర్ ను నియంత్రణలో ఉంచుతాయి.అలాగే శీతాకాలంలో విరివిగా లభించే పాలుకూరని కూడా అసలు మిస్ చేయకూడదు.

ఇంట్లో ఉండే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఒమేగా 3 యాసిడ్స్ ఉండడం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube