హైదరాబాదులో సందడి చేసిన ప్రముఖ బాక్సర్ మేరీకోమ్

హైదరాబాద్: ‘సంకల్ప్ దివాస్ 2023’( Sankalp Diwas )లో భాగంగా హైదరాబాద్‌‌లోని సంప్రదాయ వేదిక శిల్పారామం‌లో జరిగిన కార్యక్రమంలో భారతీయ ఒలింపిక్ బాక్సర్, రాజకీయ నాయకురాలు మరియు మాజీ పార్లమెంటు సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయిన శ్రీమతి మేరీ కోమ్ ‘సంకల్ప్ కిరణ్ పురస్కార్’ అందుకున్నారు.భారతదేశంలోని రియల్ ఎస్టేట్ ఆతిథ్య సంస్థల్లో ఒకటైన సుచిర్ ఇండియా సీఎస్ఆర్ విభాగమైన సుచిర్ ఇండియా ఫౌండేషన్ ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

 Mary Kom Recived Sankalp Kiran Puraskar Award , Sankalp Diwas , Mary Kom , Shil-TeluguStop.com

మానవతావాది, ప్రముఖ వ్యాపార వేత్త లయన్ డాక్టర్ వై.కిరణ్ జన్మదినం సందర్భంగా ‘సంకల్ప్ దివస్’ ప్రతి సంవత్సరం నవంబర్ 28న జరుపుతుంటారు.ఈ సంవత్సరం ఈ వేడుకను శిల్పారామం‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ వేడుకలో ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’ను శ్రీమతి మేరీ కోమ్‌కు( V ( తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ( Gareth Wynn Owen )అందజేశారు.

ఈ సందర్భంగా లయన్ డాక్టర్ వై.కిరణ్ వారితో కలిసి పలువురుకి అవార్డులను అందజేశారు.తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా ఉన్న సుచిర్ అసోసియేటెడ్ 50ప్లస్ NGOలను సంకల్ప్ సిద్ధి పురస్కారంతో సత్కరించారు.ఈ సంవత్సరం సంకల్ప్ సంజీవని పురస్కారాలను న్యూ ఆర్క్ మిషన్ ఆఫ్ ఇండియా రాజా, టాలీవుడ్ సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్, పారా అథ్లెట్‌ కుడుముల లోకేశ్వరి అందుకున్నారు.

పురస్కారం అందుకోవడం పట్ల పద్మవిభూషణ్ శ్రీమతి మేరీకోమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.‘‘సంకల్ప్ కిరణ్ పురస్కారాని( Sankalp Kiran Puraskar )కి ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది.

డాక్టర్ వై.కిరణ్ తన పుట్టినరోజును జరుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన రోజుగా ఏర్పాటు చేసుకోవడం మరియు స్పెషల్ పిల్లలతో తన పుట్టినరోజున గడిపిన తీరు చాలా ఆనందంగా ఉంది.ఈ దేశాన్ని మరియు ప్రపంచాన్ని మార్చడానికి, ఇవ్వడాన్ని విశ్వసించే ఇలాంటి వ్యక్తులు భారతదేశానికి చాలా మంది అవసరం.ఈ సన్మానాన్ని స్వీకరించినందుకు మరియు అందరితో కలిసి వేడుకలో భాగమైనందుకు నాకు సంతోషంగా ఉందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube