నల్లగొండ జిల్లా:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది.మైకులన్నీ మూగబోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది.
అయితే ఈసీ మాత్రం యాక్టివ్ మోడ్‌లోకి వచ్చింది.ప్రచార గడువు ముగియగానే సీన్‌లోకొచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్‌రాజ్ ఎలాంటి ప్రచారానికి తావులేదని స్పష్టం చేశారు.
పార్టీలు ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరించారు.స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని ఆదేశించారు.
సినిమాలు,సోషల్ మీడియాలోనూ ప్రచారం నిషేధమన్నారు.టీవీలు, రేడియోలు,కేబుల్ నెట్‌వర్క్‌ల్లో ప్రచారం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
ఈవీఎంల దగ్గరకు పోలింగ్ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదన్నారు.తనిఖీలు పారదర్శకంగా జరుగుతాయని, కావాలంటే నేతల అనుచరులు స్వయంగా వెళ్లి చూడొచ్చన్నారు.
హోం ఓటింగ్ ద్వారా 27,175 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు.ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేశారు సీఈవో.
పోలింగ్ సండదర్భంగా అధికారులకు బాధ్యతలు అప్పగించింది ఎన్నికల సంఘం.ప్రతి పోలింగ్ బూత్( POLLING BOOTH ) లో ఒక ప్రిసైడింగ్ అధికారి,ముగ్గురు సహాయ అధికారులు ఉంటారు.
ప్రిసైడింగ్ అధికారులు పి.ఓ డైరీ, ఫారం-17ఏ,17 సి పరిశీలించి నమోదు చేయాల్సి ఉంటుంది.పి.ఓ ల వద్ద సంబంధిత పోలింగ్ స్టేషన్ ఓటర్ల జాబితా, ఏ.ఎస్.డి లిస్ట్ కలిగి ఉంటారు.ఉదయం 5:30 గంటలకే పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ ను నిర్వహిస్తారు.50 ఓట్లను వేసి వాటిని సి.ఆర్.సి ద్వారా క్లియర్ చేయాల్సి ఉంటుంది.ఈ సందర్భంగా వచ్చే వి.వి.ప్యాట్ స్లిప్ లను భద్రపరుస్తారు.ఇక పోలింగ్ రోజు ఓటర్లు ఎపిక్ కార్డుతో పాటు భారత ఎన్నికల సంఘం సూచించిన డాక్యుమెంట్లు వెంట తీసుకుని రావల్సి ఉంటుంది.
వెంట తీసుకుని రావల్సిన ధృవపత్రాలు ఇవే ఆధార్ కార్డు,పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ జారీచేసిన ఫోటోతో కూడిన పాస్ బుక్,కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా జారీచేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్,పాన్ కార్డు( PAN card ),ఆర్జీఐ ద్వారా జారీచేసిన స్మార్ట్ కార్డు, ఇడియన్ పాస్ పోర్టు, ఫోటోతో కూడిన పింఛన్ మంజూరు డాక్యుమెంట్,ఫోటోతో కూడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం/PSUs/Public Limited Companies ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంఎల్‌ఏ,ఎంపి, ఎమ్మెల్సీలు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం, దివ్యాంగుల గుర్తింపు కార్డు ఏదైనా ఒక గుర్తింపు కార్డులను వెంట తీసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు 29వ తేదీన సంబంధిత డి.ఆర్.సి సెంటర్లకు వెళ్లి ఈ.వి.ఎం లను సేకరించుకొని నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.ప్రిసైడింగ్ అధికారులు చెక్ లిస్ట్ ఆధారంగా క్రమపద్దతిలో తమ విధులను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.