నల్లగొండ జిల్లా:రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మంగళవారం సాయంత్రం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసింది.పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచారం బంద్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుంది.48 గంటల ముందు నియోజకవర్గంలో సంబంధం లేని ఏ ఒక్కరు ఉండకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.దీంతో ఇతర నియోజకవర్గాలు,ఇతర జిల్లా,ఇతర రాష్ట్రాల నేతలు తప్పనిసరిగా నియోజకవర్గాలను విడిచి వెళ్లాల్సి ఉంటుంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారానికి తెరపదింది.ఇప్పటికే ఈవీఎంలు ఆయా నియోజకవర్గాలకు అధికారులు చేర్చారు.రేపు నియోజకవర్గ కేంద్రాల్లో అధికారులకు ఈవీఎంలను సిబ్బందిని కేటాయించనున్నారు.ఇలా కేటాయించిన ఈవీఎంలను అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్ళవలసి ఉంటుంది.
అధికారులను తీసుకెళ్లడానికి ప్రత్యేక వాహనాలను ఉపయోగించనున్నారు.అధికారులు ఈవీఎంలతో పాటు వారి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి బుధవారం రాత్రి అక్కడే బస చేసి ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.
గురువారం సాయంత్రం ఐదు గంటలకల్లా పోలింగ్ ముగించవలసి ఉంటుంది.ఒకవేళ పోలింగ్ కు ఐదు గంటల వరకు ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లయితే ఐదు గంటల వరకు వరసలో వేచి ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్ గేటు వేసి బారులు తీరిన ఓటర్లతో ఓట్లు వేయించనున్నారు.
తర్వాత అధికారులు ఈవీఎంలను సీజ్ చేసి నియోజకవర్గ కేంద్రాలకు తరలించి అధికారులకు అప్పగించవలసి ఉంటుంది.ఇదిలా ఉంటే ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్దులు ప్రలోభాలకు తెరలేపారు.
జిల్లాలోని అన్ని ప్రధాన పార్టీలు మంగళవారం రాత్రి నుండి ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం మొదలుపెట్టారు.మద్యం,నగదుతో ఓటర్లకు ఎరా ఎరవేస్తునున్నారు.
ఇప్పటికే పలు ప్రధాన పార్టీలు మద్యాన్ని దిగుమతి చేసుకొని గ్రామాలు,వార్డుల వారిగా మద్యాన్ని పంపిణీ చేశారు.ఇక గ్రామాలు వార్డులలో నాయకులు ఓటర్ల వారీగా నగదు,మద్యం అనేది బెరీజు వేసుకొని పంపిణీ చేయనున్నారు.
ఒక ఇంట్లో 5 ఓట్లు ఉంటే ఓటరుకు 1000 నుండి 1500 రూపాయలు ఇవ్వనున్నట్లు రాజకీయాల వర్గాల ద్వారా తెలుస్తోంది.విద్యావంతులు ఇంట్లో ఓట్లు ఉంటే వారు డబ్బు తీసుకుంటానికి మొహమాటం పడతారు కాబట్టి వారికి అత్యంత ఖరీదైన మద్యం బాటిళ్లు పంపిణీ చేయనున్నట్లు ఒక పార్టీ నాయకుడు చెబుతున్నారు.
ఏది ఏమైనా వారికి మంగళవారం రాత్రి బుధవారం రోజు మొత్తం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి సమయం ఉంటుంది.అన్ని పార్టీల నేతలు ప్రస్తుతానికి బిజీ బిజీగా ఉన్నారు
.