నల్లగొండ జిల్లా: తెలంగాణలో ఎన్నిక( Telangana elections, ల ప్రచారం నిన్నటితో ముగియడంతో ఆయా పార్టీల అభ్యర్థులు,పార్టీ నాయకులు ఇన్నాళ్లు చేసిన ఎన్నికల ప్రచారంతో అభ్యర్థుల గెలుపులపై ఓ నిర్ణయానికి వచ్చారు.అందులో భాగంగానే ఓటరును ఆకర్షించేందుకు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
కొన్నిచోట్ల నిన్న రాత్రి నుండే మద్యం, మనీ పంపిణీ మొదలు పెట్టారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District )లోని సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలోనివివిధ నియోజకవర్గాల్లో తమకు అనుకూలమైన వాతావరణం కనిపించినా డబ్బుల పంపిణీతో ఎక్కడ ఓటర్లు మనసు చెదిరిపోతుందోనని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు.
అందుకే ఓటర్లకు తాము కూడా డబ్బులు పంచాలని,అన్ని ప్రధాన పార్టీల నాయకులుఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఇందులో పక్క పార్టీ వాళ్ళు ఓటుకు ఎంత డబ్బు ఇవ్వన్నారో దాని కంటే కొంత ఎక్కువ డబ్బు ఇచ్చి ఓట్లు రాబట్టుకోవాలని మరొక పార్టీ పన్నాగం పన్నుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే ఓ పార్టీ ఓటుకు రూ.1000లు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం.ఆ క్రమంలోనే మరొక పార్టీ రూ.1500 నుంచి 2000 ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయకుండా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.ఈ విధంగా ప్రధాన పార్టీలు1 లక్ష నుంచి 1.50 లక్షల వరకు ఓట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధపడ్డట్టు సమాచారం.ఓటర్లకు పంచాల్సిన డబ్బులు ఇప్పటికే క్షేత్రస్థాయిలోకి డంపు చేసినట్లు సమాచారం.డబ్బులు ఇచ్చే ముందు పార్టీతో సంబంధం లేకుండా అందరికీ సొమ్ము ముట్టు చెబితే ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని భావనలో పార్టీల అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం.ఇదే కాకుండా ఇప్పటికే గ్రామాలలో మద్యం సీసాలు( Liquor bottles ) కూడా డంపు చేసినట్లు తెలుస్తోంది.15 రోజులుగా డబ్బుల ఖర్చుకు ఇష్టం లేని నేతలు ఈ రెండు రోజుల్లో ఎంత సొమ్ము ఖర్చు అయినా సరే తాము గెలవాల్సిందేనని పట్టుదలతో ఉన్నట్లు సమాచారం
.






