Rani Mukerji : ఆ సినిమా చూశాక చాలామంది విడాకులు తీసుకున్నారు.. రాణీ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

బాలీవుడ్ ప్రముఖ నటి రాణీ ముఖర్జీ( Rani Mukerji ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

 Rani Mukerji Says There Were A Lot Of Divorces After People Watched Kabhi Alvid-TeluguStop.com

ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఆమె నటించిన కభీ అల్విద నా కహెనా సినిమా చూసిన తర్వాత చాలామంది విడాకులు తీసుకున్నట్లు ఆమె తెలిపింది.ఈ సందర్భంగా రాణి ముఖర్జీ మాట్లాడుతూ.

కభీ అల్విద నా కహెనీ సినిమా రిలీజ్ తర్వాత చాలా విడాకులు నమోదయ్యాయి.

Telugu Bollywood, Divorce, Kabhialvida, Karan Johar, Rani Mukerji, Shahrukh Khan

చాలా మంది థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను కాస్త అసౌకర్యంగానే చూశారు.ఈ సినిమాకు కరణ్ కు( Karan Johar ) వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఇలాగే ఉంది.ఈ సినిమా చాలా మంది కళ్లు తెరిపించింది.

సంతోషంగా ఉండాలని చాలా మంది నిర్ణయించుకున్నారు అని రాణీ ముఖర్జీ తెలిపారు.కాగా ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో తన పాత్ర గురించి కూడా రాణీ ముఖర్జీ ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.ఈ సినిమాలోని మాయ పాత్ర ఎంతో అందమైనది.

ఆమె రిషీని మరో విధంగా ప్రేమిస్తుంది.షారుక్ ఖాన్( Shahrukh Khan )పోషించిన పాత్రలో ఆమె తాను ఎప్పుడూ కోరుకునే రొమాన్స్ ను కూడా గుర్తిస్తుంది.

ఒక మహిళకు సంబంధించి ఆమె ఏం కావాలనుకుంటుంది అన్నదానిపై మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Telugu Bollywood, Divorce, Kabhialvida, Karan Johar, Rani Mukerji, Shahrukh Khan

ఒక భర్త కేవలం కొట్టకపోయినంత మాత్రాన అతడు బెడ్ పై బాగా ఉంటాడని లేదంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని కాదు.ఈ మగాడిని చూసి ఆకర్షితురాలివి అయ్యావా అని ఎవరూ ఒక మహిళను అడగరు అని రాణీ ముఖర్జీ చెప్పుకొచ్చింది.ఇష్టం లేని కాపురం చేయలేక సినిమాలో ఈ రెండు జంటలు తమ భర్త లేదా భార్యను వదిలేసి మరొకరితో కలిసి జీవిస్తారు.

ఆ విషయంలో ఈ సినిమా చాలా మంది కళ్లు తెరిపించిందని రాణీ ముఖర్జీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube