ఓవర్‌వర్క్ కారణంగా చనిపోయిన చైనీస్ కుర్రోడు..

ప్రజలు వర్క్, పర్సనల్ లైఫ్ మధ్య సరైన బ్యాలెన్స్ మైంటైన్ చేయాలి.ఓవర్ వర్క్ మానవుల ప్రాణాలను తీసేయగలదు.

 Chinese Boy Died Due To Overwork, Chinese Man, Li Hao, Undergraduate Student, 89-TeluguStop.com

ఎక్కువ గంటలపాటు పని చేయడం వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది.తగినంత విశ్రాంతి లేకపోవడంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

అది చివరికి మరణానికి దారి తీస్తుంది.అందుకే డాక్టర్లు ఓవర్ వర్క్ చేయవద్దని హెచ్చరిస్తుంటారు.

అయితే ఇటీవల ఒక చైనీస్ యువకుడు( Chinese youth ) ఓవర్ వర్క్ ప్రాణాలను తీసేస్తుందని తెలియక చివరికి మృత్యువాత పడ్డాడు.

వివరాల్లోకి వెళితే, చైనీస్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి అయిన లి హావో ( Li Hao )ఒక నెలలో 89 గేమింగ్ లైవ్ స్ట్రీమ్‌లు చేశాడు.

అంటే రోజుకు దాదాపు మూడు లైవ్ స్ట్రీమ్‌లు చేశాడు.ఒక్కొక్క స్ట్రీమ్ ఎన్ని గంటలు కొనసాగిందో తెలియ రాలేదు కానీ ఈ స్ట్రీమ్‌ల వల్ల అతడి శరీరంపై తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది.

చివరికి ఆ యువకుడు అధిక పనితో మరణించాడు.అతను జెంగ్‌జౌలోని ఒక గేమింగ్ కంపెనీలో( gaming company in Zhengzhou ) ఇంటర్న్‌గా ఉన్నాడు, నెలకు 3,000 యువాన్‌లు (సుమారు రూ.35,000) సంపాదించాడు.అక్టోబర్ మధ్యలో పని చేయడం ప్రారంభించాడు.

Telugu Live Streams, Chinese, Latest, Li Hao, Nri, Undergraduate-Telugu NRI

లి హావో నవంబర్ 10న తన చివరి సెషన్‌ను రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు ముగించిన తర్వాత మరణించాడు.రీసెంట్‌గా అతను వరుసగా ఐదు రాత్రులు నైట్ షిఫ్టులు చేస్తున్నాడు.ఈ క్రమంలో రూమ్‌మేట్ అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు.అంబులెన్స్‌కు కాల్ చేశాడు, కానీ వైద్యులు అతన్ని కాపాడలేకపోయారు.అప్పటికే హావో చనిపోయాడు.

Telugu Live Streams, Chinese, Latest, Li Hao, Nri, Undergraduate-Telugu NRI

వేసవి కాలం నుంచి ఇంటర్న్‌షిప్‌ల కోసం చూస్తున్నాడని, తన సత్తా చాటాలని తహతహలాడుతున్నాడని అతని తండ్రి చెప్పాడు.గేమింగ్ కంపెనీ అతని మరణానికి ఎటువంటి బాధ్యతను నిరాకరించింది.మానవతా కోణంలో అతని కుటుంబానికి 5,000 యువాన్ల (దాదాపు రూ.59 వేలు)ను మాత్రమే ఇచ్చింది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ సంఘటనను నివేదించింది.

కంపెనీ నిర్లక్ష్యానికి సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube