ఉత్తరాఖండ్( Uttarakhand ) ఉత్తర కాశీ జిల్లాలోని సిల్స్యారా టన్నెల్ సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కూకు పోవటం తెలిసిందే.దాదాపు 17 రోజులపాటు టన్నెల్ లోనే కార్మికులు గడపడం జరిగింది.
ఈ క్రమంలో పైప్ లైన్ ద్వారా ఆహారం, విటమిన్ టాబ్లెట్స్… ఆక్సిజన్ సరఫరా చేస్తూ వారిని కాపాడుకుంటూ వచ్చారు.సాంకేతిక కారణాలతో లోపలికి వెళ్లే పరిస్థితి మొన్నటివరకు లేదు.
ఈ క్రమంలో కూలిపోయిన సొరంగం( Tunnel ) కింద చిక్కుకున్న నిర్మాణ కార్మికులను బయటకు తీసుకురావడానికి సీనియర్ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు.వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలలో భాగంగా ఎదురైనా కొన్ని ఇబ్బందులు కార్మికుల కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేశాయి.

సొరంగంలో డ్రిల్లింగ్ మిషన్ ద్వారా కూడా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది.ఈ క్రమంలో తాజాగా చేసిన రెస్క్యూ( Rescue Operation ) ఎంతో శ్రమించి చేసిన ఆపరేషన్ లో 41 మంది కార్మికులను సురక్షితంగా సొరంగం నుండి బయటకు తీసుకురావడం జరిగింది.ఈ క్రమంలో టన్నెల్ నుంచి 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ సిబ్బంది వెంటనే వారిని అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్ కి తరలించడం జరిగింది.ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.17 రోజుల తర్వాత కార్మికులు సురక్షితంగా సొరంగం నుండి బయటపడటంతో కార్మికుల కుటుంబ సభ్యులు.సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.







