లండన్ డిప్యూటీ మేయర్ పదవి నుంచి తప్పుకున్న రాజేష్ అగర్వాల్.. కారణమిదేనా..?

భారత సంతతికి చెందిన లండన్ డిప్యూటీ మేయర్ (బిజినెస్) తన పదవికి రాజీనామా చేశారు.లీసెస్టర్ ఈస్ట్ నుంచి లేబర్ పార్టీ తరపున పార్లమెంటరీ అభ్యర్ధిగా ఎంపికైన నేపథ్యంలో ప్రచారంపై దృష్టి పెట్టేందుకు గాను ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.ఏడాదికి 1,41,406 పౌండ్ల వేతనంతో ఆయనను లండన్ మేయర్ సాదిక్ ఖాన్ నియమించారు.2016లో రాజేష్ అగర్వాల్( Rajesh Agarwal ) డిప్యూటీ మేయర్ (బిజినెస్) బాధ్యతలు స్వీకరించారు.యూకేలో అతిపెద్ద దక్షిణాసియా జనాభా కలిగిన నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడానికి నవంబర్ 18న జరిగిన హస్టింగ్‌లో రాజేష్ ఎంపికయ్యారు.2022లో భారత్ – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ తర్వాత లీసెస్టర్‌లో మత ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే.

 London's Indian-origin Deputy Mayor Rajesh Agrawal For Business To Step Down , D-TeluguStop.com
Telugu America, Destiny Agency, Deputy Mayor, Deputymayor, India, Indiapakistan,

డిప్యూటీ మేయర్ పదవి ( Deputy Mayor )నుంచి తప్పుకుంటున్నట్లుగా రాజేష్ సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్ధిగా తాను ఇటీవల తాను ఎంపికయ్యానని.లీసెస్టర్ ఈస్ట్‌లో ప్రచారంపై దృష్టి పెట్టేందుకే డిప్యూటీ మేయర్ పదవి నుంచి వైదొలగాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు.గత ఏడున్నర సంవత్సరాలుగా ఈ హోదాలో లండన్ వాసులకు సేవ చేయడం నిజంగా గౌరవంగా వుందన్నారు.

మిలియన్ల మంది ఇతర వ్యక్తుల వలె .తాను చాలా తక్కువ ఖర్చుతోనే ఈ దేశానికి చేరుకున్నానని రాజేష్ గుర్తుచేశారు.బ్రెగ్జిట్, వాణిజ్య చర్చలు, కోవిడ్ 19 మహమ్మారితో పాటు ఇప్పుడు జీవన వ్యయ సంక్షోభం నేపథ్యంలో కీలక చర్యలు చేపట్టానని అగర్వాల్ వెల్లడించారు.లండన్‌కు పెట్టుబడులను ఆకర్షించడానికి భారత్, జపాన్, అమెరికాలలో ఆయన పర్యటించారు.

కేపిటల్ బిజినెస్ గ్రోత్ అండ్ డెస్టినీ ఏజెన్సీకి రాజేష్ అగర్వాల్ చైర్‌గానూ వ్యవహరించారు.

Telugu America, Destiny Agency, Deputy Mayor, Deputymayor, India, Indiapakistan,

ప్రస్తుతం లీసెస్టర్ ఈస్ట్‌కు తనలాంటి ఎంపీ అవసరమని ఆయన పేర్కొన్నారు.నియోజకవర్గంలోని అందరికీ సరసమైన గృహాలు అందించడంపై దృష్టి సారిస్తానని, విభిన్న కమ్యూనిటీలు కలిసి వచ్చేలా ప్రోత్సహిస్తానని రాజేష్ హామీ ఇచ్చారు.ఉద్యోగాలను కాపాడతానని, న్యాయమైన వేతనాన్ని అందజేయడం, జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.1987 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో లీసెస్టర్ ఈస్ట్‌ను లేబర్ పార్టీ గెలుస్తూ వస్తోంది.అయితే మేలో జరిగిన నగర స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ పనితీరుపై ఆందోళనలు వెల్లువెత్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube