ఏలూరు జిల్లాలోని కైకలూరులో వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్ర జరగనుంది.ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి వైసీపీ బస్సు యాత్రను చేపట్టనుంది.
అనంతరం సాయంత్రం 4 గంటలకు సంత మార్కెట్ వద్ద బహిరంగ సభను వైసీపీ నిర్వహించనుంది.కాగా ఈ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
అయితే సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను సాధికారత దిశగా నడిపించిన తీరును, వారికి చేసిన మేలును వివరిస్తూ వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.







