సాధారణంగా ప్రజలు అరటిపండ్లను( Bananas ) తొక్క తీసి, పండ్లను కొరికి తింటూ ఎంజాయ్ చేస్తారు.కానీ ఇంగ్లాండ్ రాణికి మాత్రం ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదు.
ఆమె ఒక కత్తి, ఫోర్క్‌తో అరటిపండ్లు తినాలనే కఠినమైన మర్యాదలను అనుసరిస్తుంది.ఈ వింత రాజ కుటుంబీకుల అలవాటు గురించి 11 ఏళ్లుగా రాజకుటుంబంలో పనిచేసిన మాజీ చెఫ్ వెల్లడించాడు.

ఇతను డారెన్ మెక్‌గ్రాడీ ఈటింగ్ రాయల్లీ ( Darren McGrady Eating Royally )అనే పుస్తకాన్ని రాశాడు, అక్కడ అతను రాణి ఆహారం, ప్రాధాన్యతల గురించి కొన్ని రహస్యాలను పంచుకున్నాడు.“కోతి” లాగా అరటిపండ్లు తినడం రాణికి ఇష్టం లేదని, అందుకే ఆమె వేరే పద్ధతిని ఉపయోగిస్తుందని ఆయన వివరించారు.ఆమె అరటిపండు చివరలను కత్తితో కట్ చేసి, ఆపై బనానా స్కిన్‌ను పొడవుగా ముక్కలు చేసి, ఆపై దానిని ఓపెన్ చేస్తుంది.ఆ తర్వాత పండ్ల చిన్న ముక్కలను కోసి ఫోర్క్‌తో తింటుంది.

విలియం హాన్సన్( William Hanson ) ఆమె అరటిపండు ఎలా తింటుందో చేసి మరి చూపించాడు.అతడు అరటిపండు తింటున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోను @TheFigen_ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 6 లక్షల దాక వ్యూస్ వచ్చాయి.4 వేల దాక లైకులు వచ్చాయి.ఇదే వీడియో కొద్ది రోజుల క్రితం టిక్‌టాక్‌లోనూ విస్తృతంగా వైరల్ అయింది.ఇప్పుడు ట్విట్టర్‌లో ఇది చక్కర్లు కొడుతోంది.రాణి అరటిపండును ఎలా తింటుందో, ఆమె ఎందుకు అలా చేస్తుందో అతను చూపించాడు.ప్రైమేట్ లాగా అరటిపండు తొక్క తీసి ఆభాగా తినడం గౌరవప్రదమైనది కాదని అతను చెప్పాడు.
క్వీన్స్ టెక్నిక్‌ను ప్రదర్శించాడు.ఈ వీడియో చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.
అరటిపండు విషయంలో కూడా ఎంత స్టైలిష్ గా ఉండాలా అని కామెంట్ చేస్తున్నారు.







