తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోల్లో రవితేజ ఒకరు.ఈయన ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగి ఇక్కడ తనకంటూ ఒక మార్కును చూపిస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన సాధించిన విజయాలను చూస్తే ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోవాల్సిందే… ఎందుకంటే రవితేజ ఎంటర్టైనర్ సినిమాలను చేస్తూనే వరుసగా హిట్లను కొడుతూ ఉంటాడు.అందుకే రవితేజ అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం ఉంటుంది.
అలాగే ఆయన సినిమాలు చూడడానికి ప్రతి ఒక్క అభిమాని కూడా ఇష్టపడుతూ ఉంటాడు.ఇక ప్రస్తుతం రవితేజ కార్తీక్ ఘట్టమనేని ( Karthik Gattamneni )డైరెక్షన్ లో ఈగల్ అనే సినిమా చేస్తున్నాడు.

దీంతోపాటుగా గోపీచంద్ మలినేని ( Gopichand Malineni )డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయాల్సింది కానీ అది ఓవర్ బడ్జెట్ కారణంగా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని తాత్కాలికం గా నిలిపివేసినట్టుగా తెలుస్తుంది.ఇక ఇలాంటి క్రమంలో రవితేజతో సినిమా చేయడానికి డైరెక్టర్ అనుధీప్( Anudeep Kv ) చాలా ఇంట్రెస్ట్ ని చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.నిజానికి ఇప్పటి వరకు అనుదిప్ చేసిన సినిమాల్లో జాతి రత్నాలు మూవీ మంచి విజయాన్ని అందుకుంది.ఇక ప్రిన్స్ సినిమా మాత్రం అంత పెద్ద సక్సెస్ సాధించలేకపోయింది…ఇక దాంతో పాటు గా ఈయన ఇప్పుడు రవితేజ హీరో గా ఒక సినిమా చేయనున్నాడు అనే టాక్ అయితే వస్తుంది.

అయితే ఈ సినిమా తో హిట్ కొడితే అనుదీప్ ఇక స్టార్ హీరోలతో సినిమా చేయడం పక్క అని ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఇక అందుకే అను దీప్ ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టు గా తెలుస్తుంది…అయితే ప్రస్తుతం అనుదీప్ ఈ సినిమాని సరికొత్త తియబితున్నట్టు గా కూడా తెలుస్తుంది…
.







