iQOO స్మార్ట్ ఫోన్లపై( iQOO Smartphones ) భారీ డిస్కౌంట్ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది.ఐకూ ఫ్లాగ్ షిప్ ఫోన్లపై రూ.15వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంక్ లేదా హెచ్ డి ఎఫ్ సీ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2 వేల తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.ఈ స్మార్ట్ ఫోన్ లపై ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.ఆ స్మార్ట్ ఫోన్ల వివరాలు ఏమిటో చూద్దాం.
iQOO 11 5G స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 చిప్ సెట్, 2K E6 అమోలెడ్ స్క్రీన్ తో ఉంటుంది.ఆండ్రాయిడ్ 13( Android 13 ) ఆధారిత ఫన్ టచ్ ఆపరేటింగ్ సిస్టం ను కలిగి ఉంటుంది.ఈ ఫోన్ 50MP OIS+ 8MP+ 13MP కెమెరాలతో ఉంటుంది.ముందు వైపు సెల్ఫీ వీడియో కాల్స్ కోసం 16MP కెమెరాతో ఉంటుంది.120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ సామర్థ్యం తో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.49999 గా ఉంది.ఎంపిక చేసిన బ్యాంక్ కార్డు ద్వారా రూ.2 వేల డిస్కౌంట్ తో పాటు రూ.2999 విలువైన vivo TWS Air ఇయర్ బడ్స్ ను ఉచితంగా పొందవచ్చు.
iQOO Z7s 5G స్మార్ట్ ఫోన్:
ఈ ఫోన్ 6.38 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే తో( AmoLED Display ) వస్తోంది.90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.6nm స్నాప్ డ్రాగన్ 695 CPU చిప్ లో ఉంటుంది.64MP OIS+ 2MP కెమెరాలతో ఉంటుంది.ముందు వైపు 16MP కెమెరాతో వస్తుంది.44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4500 mAh బ్యాటరీ సామర్థ్యం తో ఉంటుంది.ఈ ఫోన్ ధర రూ.17999 గా ఉంది.బ్యాంక్ ఆఫర్లతో అయితే రూ.15999 కే పొందవచ్చు.
iQOO Z7 ప్రో 5G:
ఈ ఫోన్ కర్వడ్ అమోలెడ్ డిస్ ప్లే తో ఉంటుంది.4nm డైమెన్సిటీ 7200చిప్, ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్ టచ్ OS 13 పై పని చేస్తుంది.64MP OIS+ 2MP కెమెరాలతో పాటు ముందువైపు 16MP కెమెరాతో వస్తుంది.66w చార్జింగ్ సపోర్ట్ తో 4600mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ ఫోన్ ధర రూ.21999 కే పొందవచ్చు.