ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన రెండవ భార్య..!

ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలన్నీ( Extramarital affair ) చివరకు కుటుంబాలను నాశనం చేసి రోడ్డున పడేస్తున్నాయి.ఓ వివాహిత తన ప్రియుడుతో కలిసి తన రెండవ భర్తను హత్య చేసిన ఘటన ముళబాగిలు తాలూకా మినజేనహాళ్లి లో చోటుచేసుకుంది అందుకు సంబంధించిన వివరాలు చూద్దాం.

 The Second Wife Who Killed Her Husband Along With Her Boyfriend, Second Wife, H-TeluguStop.com

పోలీసులు( Police ) తెలిపిన వివరాల ప్రకారం.మినజేనహాళ్లి గ్రామానికి చెందిన మంజునాథ్ (48) సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు.

ఇతనికి బంగారు పేట తాలూకా మాదముత్తన హాళ్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ కు గత కొంతకాలంగా తరచూ గొడవలు జరుగుతుండేవి.

మంజునాథ్( Manjunath ) తన మొదటి భార్య సౌభాగ్యమ్మ తో దూరంగా ఉంటూ, రెండవ భార్య నేత్రతో కలిసి ఉంటున్నాడు.అయితే నేత్రకు, శ్రీనివాస్ కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది.రూ.40 వేల కోసం ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు బంధువులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో మంజునాథ్ ను ఎవరో తెలియని దుండగులు కొడవలితో నరికి హత్య చేశారు.ఈ హత్య చేసింది రెండవ భార్య నేత్ర, ఆమె ప్రియుడు శ్రీనివాస్ అని మొదటి భార్య సౌభాగ్యమ్మ ఆరోపిస్తోంది.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.మృతుడి మామ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

ఈ హత్య ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగిందా లేదంటే హత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా.ఈ హత్య లో ముఖ్య సూత్రధారి ఎవరు అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube