తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న బర్రెలక్క అలియాస్ శిరీష పేరు కేవలం కొల్లాపూర్ నియోజక వర్గం( Kollapur Assembly constituency ), రాష్ట్రంలోనే కాదు ఇండియాలో ఉన్న తెలుగు ప్రజలంతా అలాగే దేశ విదేశాల్లో ఉన్న ఎన్నారైలు సైతం ఈమె ధైర్యానికి మెచ్చుకుంటున్నారు.ధైర్యంగా అడుగులు ముందుకు వేసి నామినేషన్ వేసి ప్రచారంలో దూసుకుపోతుండడంతో ఎన్నోసార్లు అధికారంలో ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు కూడా భయపడుతున్నారు.
అసలు ఈమె మాకు పోటీనే కాదు అని భుజాలు తడుముకున్న కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు ఈమెను చూసి భయపడుతున్నారు.అంతే కాదు ఈమె పోటీ నుండి తప్పుకోవాలని ఎన్ని కోట్లు అయినా ఇస్తామని బుజ్జగిస్తున్నారు.
అలాగే బెదిరిస్తున్నారు.అయినప్పటికీ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా బర్రెలక్క ప్రచారంలో మునిగి తేలుతుంది.
అయితే బర్రెలక్క ( Shirisha )ప్రచారంపై రాజకీయ విశ్లేషకులు సైతం అసలు ఆమె వెనక ఏ పార్టీ ఉంది అని ఆరా తీస్తున్నారు.అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేసే చాలామంది నాయకులు వారి వెనుక ఏదో పార్టీ హస్తం ఉండే ఉంటుంది.అలా గెలిచాక వారి పార్టీలోకి వెళ్తుంటారు.ఇంకొంత మంది అయితే స్వతంత్ర అభ్యర్థులుగానే ఉంటారు.కానీ బర్రెలక్క వెనక ఎవరి హస్తం ఉంది అంటూ రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు.అయితే బర్రెలక్క ధైర్యం వెనక అసలు ఏ పార్టీ లేదట.
ఈమె రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయంతో నామినేషన్ వేసిందట.కానీ తనకు ఇంత ఆదరణ వస్తుంది అని భావించలేదట.
ఇక ఈమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో నాకు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar )సార్ ఆదర్శమని చెప్పుకొచ్చింది.అయితే ఏ పార్టీలోకి వెళ్తావు అని అడగగా నేను ఏ పార్టీలోకి వెళ్ళను.
నేను నిరుద్యోగులకు, సమస్యలు ఉన్నవారికి అండగా నిలుస్తాను.కానీ ఏ పార్టీలోకి వెళ్ళేది లేదు.
ఒకవేళ ఎన్నికల్లో నేను గెలవకపోయినా కూడా నా వంతు నేను ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటాను అని చెప్పింది.ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తనకి ఆదర్శం అని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఒకవేళ గెలిస్తే ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆమెతో మాట్లాడి బీఎస్పీ పార్టీలోకి చేర్చుకుంటారు అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరి చూడాలి బర్రెలక్క ఈ ఎన్నికల్లో గెలుస్తుందో లేదో.