నేటి నుంచే లోకేష్ యువ గళం ! ఆ విషయాలను ప్రస్తావిస్తారా ?

చాలా రోజులు విరామం తర్వాత టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )యువ గళం పాదయాత్రను పునః ప్రారంభించనున్నారు.చంద్రబాబు అరెస్టు తరువాత అద్దాంతరంగా ఈ యాత్రను నిలిపివేసిన లోకేష్ మళ్లీ రాజోలు నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నారు .

 Lokesh's Young Voice From Today! Will You Mention Those Things , Tdp, Janasen-TeluguStop.com

కుప్పంలో ప్రారంభమైన యువ గళం పాదయాత్ర రాజోలు నియోజకవర్గంలో కి ప్రవేశించినప్పటికి చంద్రబాబు అరెస్టు కావడంతో ఈ పాదయాత్ర అక్కడ అర్ధంతరంగా నిలిచిపోయింది.అయితే యువ గళం పాదయాత్ర ద్వారా మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ , జగన్ పై మండిపడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చిన లోకేష్ ఈ యాత్రలో తన ప్రసంగాలకు మరింత పదును పెడతారా .చంద్రబాబు అరెస్టు వ్యవహారం తో టిడిపి కీలక నేతలపై వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందనే విషయాలను ప్రస్తావించి చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) అంశాన్ని పదే పదే ప్రస్తావించి ప్రజల్లో సెంటిమెంట్ పెరిగి,  అది టిడిపికి సానుభూతిగా మారే విధంగా లోకేష్ ప్రసంగాలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

Telugu Ap, Janasena, Lokesh, Ysrcp-Politics

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన నేపథ్యంలో వైసిపి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడంతోపాటు , టిడిపి వైపు జనాలు చూపు పడేవిధంగా లోకేష్ ప్రసంగాలు ఉండే అవకాశం కనిపిస్తుంది.లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగా నే  చంద్రబాబు జిల్లాలు,  నియోజకవర్గాల వారీగా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టనున్నారు.

  ఇక నారా భువనేశ్వరి సైతం మధ్యలో నిలిపివేసిన  పరామర్శ యాత్రను మళ్ళీ మొదలుపెట్టనున్నారు.

Telugu Ap, Janasena, Lokesh, Ysrcp-Politics

ఈ విధంగా ఒకవైపు లోకేష్,  మరోవైపు చంద్రబాబు , భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) లు జనాల్లో ఉంటూ,  టిడిపి ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇక ఈ రోజు లోకేష్ యువ గళం పాదయాత్రకు సంబంధించి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.గతంతో పోలిస్తే ఇప్పుడు నిర్వహించే యువ గళం పాదయాత్ర( Yuva Galam Padayatra ) కు జనాల నుంచి విశేష స్పందన వస్తుందని లోకేష్ అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube