తెలంగాణలో రైతుబంధుకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పై తీవ్రంగా మండిపడ్డారు.
రైతుబంధును రాకుండా ఎంతకాలం ఆపగలరని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.రైతు నోటి దగ్గర ముద్దను కాంగ్రెస్ అడ్డుకుంటోందని మండిపడ్డారు.
రైతుబంధుకు ఈసీ అనుమతి ఇచ్చిందని మాత్రమే చెప్పానన్న మంత్రి హరీశ్ రావు తాను చెప్పినదాంట్లో తప్పేముందని ప్రశ్నించారు.తెలంగాణ రైతులతో తమకున్నది పేగుబంధమని పేర్కొన్నారు.
తెలంగాణలో రైతులకు రైతుబంధు కావాలంటే కాంగ్రెస్ ఖతం కావాలని తెలిపారు.ఈ క్రమంలో ప్రజలే ఓటుతో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని వెల్లడించారు.







