కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీజేపీని ప్రశ్నించే ధైర్యం కాంగ్రెస్ కు లేదని చెప్పారు.
రైతు వ్యతిరేక విధానాన్ని కాంగ్రెస్ మరోసారి బయటపెట్టిందని మండిపడ్డారు.
రైతుబంధు, రైతుబీమా అమలు కాకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
కాంగ్రెస్ కు రైతులంటే ప్రేమ లేదని చెప్పారు.కావాలనే కుట్రపూరితంగా వ్యవహారిస్తున్నారని దుయ్యబట్టారు.
రైతులను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు ప్రజల నోటి దగ్గర బుక్కను లాక్కుంటున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ ఫిర్యాదు చేసి రైతుబంధు, రైతుబీమా నిధులు విడుదల కాకుండా ఆపిందని తెలిపారు.
ఈ క్రమంలో రైతన్నలు, ప్రజలు కాంగ్రెస్ కు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.







