సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.బీఆర్ఎస్ పాలనలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేశామని తెలిపారు.
గిరిజనుల రిజర్వేషన్లను పెంచామన్న కేటీఆర్ బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.కటాఫ్ డేట్ పెంచి మిగిలిన బీడీ కార్మికులకు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు.అదేవిధంగా సౌభాగ్యలక్ష్మీ పథకం కింద మహిళలకు రూ.3 వేలు ఇస్తామని తెలిపారు.ఆసరా పెన్షన్లను దశల వారీగా రూ.5 వేలకు పెంచుతామన్నారు.తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరికీ రూ.5 లక్షల బీమా కల్పిస్తామని పేర్కొన్నారు.దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని తెలిపారు.







