తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోరు హారహోరిగా ఉంది.ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ ,కాంగ్రెస్, బిజెపిలు ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
ప్రధానంగా కాంగ్రెస్ర్, బీ ఆర్ ఎస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ అన్నట్లుగా పరిస్థితి ఉంది.ఎన్నికల్లో తమకు ఎదురే లేదు అన్నట్లుగా ధీమాతో మొదటి నుంచి ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్( Congress ) గెలవడం, తెలంగాణలోనూ ఆ ప్రభావం కనిపించడం , పెద్ద ఎత్తున చేరికలు, ఆ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు, ఇవన్నీ కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి.
దీంతో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమనే అంచనాలు అందరిలోనూ మొదలయ్యాయి.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి( BJP ) ఈ రెండు పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించినా, మూడో స్థానానికి పరిమితం అవుతుందనే ప్రచారం జరుగుతుంది.ప్రస్తుతం కాంగ్రెస్ తమదే విజయం అన్న ధీమాలో ఉంది.బీ ఆర్ ఎస్ కు ప్రభుత్వ వ్యతిరేకత , ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలు ఇబ్బందికరంగా మారింది.
రెండుసార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, మూడోసారి ఆ పార్టీకి ఛాన్స్ ఇచ్చే కంటే , మరో పార్టీకి అవకాశం ఇస్తే తప్పేంటి అన్న అభిప్రాయం జనాల్లోనూ ఉన్నట్లుగా వివిధ సర్వే సంస్థలు తేల్చేయి.అయితే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
దీంతోపాటు పోల్ మేనేజ్మెంట్, ఆర్థిక వనరుల విషయంలో బీఆర్ఎస్ మిగతా పార్టీల కంటే పై చేయి సాధించింది.దీంతో విజయంపై బీఆర్ఎస్ ధీమా గానే ఉంది. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు పార్టీలు విజయం కోసం గట్టిగా ప్రయత్నం చేయడం, ఈ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరుగుతున్న నేపథ్యంలో , హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.కాంగ్రెస్ కు 70 నుంచి 80 స్థానాలు వస్తాయి అనే అంచనాలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు.

బీఆర్ఎస్ కూడా అంతే ధీమా లో ఉంది.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కు అంత బలమైన అభ్యర్థులు ఎక్కువ చోట్ల లేరు.బీ ఆర్ ఎస్ కు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ( Khammam district )పెద్దగా పట్టు లేదు. బిఆర్ఎస్ కాంగ్రెస్ లు రెండు మిగతా చోట్ల గెలుపు ధీమాతో ఉన్నాయి.
హంగ్ ఏర్పడితే ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయం పైన ముందుగానే అలర్ట్ అవుతున్నాయి.ఇక బిజెపి ప్రధానంగా 30 స్థానాలపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక ఎంఐఎం పార్టీ ఆరేడు స్థానాలను కచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. అదే నిజమైతే ఆ పార్టీ ఎన్నికల ఫలితాలు తర్వాత బీ ఆర్ ఎస్ కే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.







