యాదాద్రి భువనగిరి జిల్లా:అన్ని గ్రామాల్లో ఎన్నికల ప్రచారహోరు కొనసాగుతున్నా,మరి కొన్ని గంటల్లో ప్రచారానికి తెరపడే అవకాశం ఉన్నా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికిఇంత వరకు బీఆర్ఎస్ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి( Koosukuntla Prabhakar Reddy ) మాత్రం ఆ ఊరిలో అడుగు పెట్టలేదు.నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా కొయ్యలగూడెం( Koyalagudem ) గ్రామాన్ని ఎల్లంబావి, కొయ్యలగూడెం గ్రామాలుగా విడదీశారు.
అయితే తమ గ్రామానికి విభజన వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని గ్రామస్తులు ఆగ్రహంతో ఉండడమే దీనికి కారణమని తెలుస్తోంది.
విభజన సమయంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ఏకపక్ష నిర్ణయంతో గ్రామ రెవిన్యూ మొత్తం ఎల్లంబావి గ్రామానికి వెళ్లడంతో కొయ్యలగూడెంలో గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకుండా బహిష్కరించారు.
దీనితో 4 ఏళ్లుగా పాలకవర్గం లేక అభివృద్ధి పూర్తిగా కుంటిపడింది.గ్రామ పాలన కార్యదర్శి చూస్తున్నారు.2022 ఉప ఎన్నికల్లో సైతం కూసుకుం Koosukuntla Prabhakar Reddy )ట్ల ఈ గ్రామానికి ప్రచారానికి రాకపోవడం గమనార్హం.కూసుకుంట్లపై ఆగ్రహంతో ఉన్న కొయ్యలగూడెం గ్రామస్తులను ప్రసన్నం చేసుకోవడంలో ఆయన విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు కూసుకుంట్ల ఆ గ్రామంలో అడుగుపెట్టక పోవడం, అసలు వస్తారో లేదో కూడా తెలియని అయోమయ స్థితి ఏర్పడడంతో మొత్తం గ్రామం ఈ ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని సమాచారం.







