సాధారణంగా ఏ పార్టీలోనైనా నేతలు తమ అధినేత అనుగ్రహం కోసం పరితపిస్తుంటారు.అధినేతను ప్రసన్నం చేసుకొని తమ నియోజకవర్గంలో సీటును కన్ఫర్మ్ చేసుకోవాలని అభ్యర్థులు ఆశపడుతూ ఉంటారు.
ఆ దిశగా అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అయితే తెలుగుదేశం జనసేన( Janasena ) పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత కొంతమంది సీనియర్ తెలుగుదేశం నాయకులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.ఎందుకంటే వారి వారి అభ్యర్థిత్వలు చంద్రబాబు చేతిలో కాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతిలో ఉండటమే దేనికి కారణం.

వచ్చే ఎన్నికల్లో కీలకపాత్ర పోషించబోతున్న జనసేన పెద్ద ఎత్తున సీట్లను తెలుగుదేశం నుంచి ఆశిస్తుంది.మరో పక్క తెలుగుదేశానికి పరిస్థితులు కూడా బాగా లేకపోవడంతో పవన్ మద్దతు ఆక్సిజన్ లా మారుతుందన్న అంచనాలు ఉండడంతో చంద్రబాబు కూడా పవన్ అడిగిన సీట్లను ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని అంచనాలున్నాయి.దాంతో తమ తమ అభ్యర్థిత్వలను నిలబెట్టుకోవాలంటే పవన్ అనుగ్రహం తప్పనిసరి అనే భావంతో పవన్ ను ప్రసన్నం చేసుకోవడానికి టిడిపి నేతలు పవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారట.

పవని విశాఖపట్నం( Visakhapatnam ) పర్యటన సందర్భంగా జనసేన నేతల కన్నా తెలుగుదేశం నేతలే ఆయనతో ఎక్కువ మసిలారని, ఆయనకు భారీ ఎత్తున స్వాగత సత్కారాలు చేసి మర్యాదలు చేశారని తెలుస్తుంది.ఈ నేతలలో తెలుగుదేశం కీలక నేత గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivasa Rao )కూడా ఉండటం విశేషం.ఏది ఏమైనా పవన్ ను మంచి చేసుకుని తమ సీటుకి ఎదురు రాకుండా చూసుకోవడమే తెలుగుదేశం నేతలు ధ్యేయం లా కనిపిస్తుంది.
మరి ఏ కారణం చేత అయినా సీటు దక్కక పోతే మాత్రం వీరు జనసేనపై విమర్శలు బాణం ఎక్కుపెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటారన్నది బహిరంగ రహస్యమే.మరి పైపై మర్యాదలకు పవన్ లొంగుతారో లేదో చూడాలి.