వర్మ చనిపోయిన తరువాతే ఆయన విలువ ఏంటో మనకు తెలుస్తుంది: అజయ్ భూపతి

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది వర్మ శిష్యులు డైరెక్టర్లుగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma) దగ్గర శిష్యరికం పొంది డైరెక్టర్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి వారిలో అజయ్ భూపతి(Ajay Bhupathi) కూడా ఒకరు.

 Ajay Bhupathi Sensational Comments On Ramgopal Varma Details, Ajay Bhupathi,ramg-TeluguStop.com

ఈయన వర్మ చేసినటువంటి ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు.అనంతరం ఆర్ఎక్స్ 100(RX 100)సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యారు మొదటి సినిమాతోనే హ్యాట్రిక్ కొట్టినటువంటి అజయ్ భూపతి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.

ఈ సినిమా తర్వాత కొంతకాలం పాటు మౌనంగా ఉన్నటువంటి అజయ్ భూపతి మహాసముద్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

మహాసముద్రం సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ పెద్దగా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో అజయ్ భూపతి తాజాగా సరికొత్త కథ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.నటి పాయల్( Payal Rajput ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన మంగళవారం(Mangalavaaram) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.ఈ క్రమంలోనే అజయ్ భూపతి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను వెల్లడిస్తున్నారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Ajay Bhupathi, Maha Samudram, Mangalavaram, Payal Rajput, Ram Gopal Varma

ఒకప్పుడు రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలను చూసి నేను ఎంతో స్ఫూర్తి పొంది అయన దగ్గర శిష్యుడుగా పనిచేస్తానని తెలిపారు.అయితే ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలో తనకు ఏమాత్రం నచ్చవని తెలిపారు.కానీ ఆర్జీవి గారి వ్యక్తిత్వం చాలా గొప్పది అంటూ అజయ్ భూపతి వెల్లడించారు ఆయన మన పక్కనే ఉంటారు కానీ ఆయన చేస్తున్న పనులు ఏంటో మనం గుర్తుపట్టలేమని తెలిపారు.మన పక్కనే ఉంటారు కానీ ఎవరినో తిడుతూ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తూ ఉంటారు ఆ పోస్టులో మనం అందరితో పాటు చూడాల్సి ఉంటుంది ఇలా ఈయన చేస్తే పోస్టుల కారణంగా బయట పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతూ ఉంటే ఈయన మాత్రం చాలా హ్యాపీగా తన పనులను తను చేసుకుంటూ ఉంటారు.

Telugu Ajay Bhupathi, Maha Samudram, Mangalavaram, Payal Rajput, Ram Gopal Varma

ఇలా ఒక్క వ్యక్తికి ఒక్కో వ్యక్తిత్వం ఉంటుందని ఈ విషయంలో ఆర్జీవి ( RGV ) చాలా సపరేట్ అంటూ తెలిపారు.ఇలాంటి వ్యక్తి మళ్లీ పుట్టకూడదు అని అనుకోకూడదు కానీ ఈయన చనిపోయిన తర్వాతే ఆయన వ్యక్తిత్వం ఏంటో విలువ ఏంటో మనకు తెలుస్తుందని, ఈయన ఎంతలా ప్రేక్షకులపై ఇంపాక్ట్ చూపించారని, ఆయన ఏ విషయానికి అసలు భయపడరు చాలా కూల్ గా ఉంటారు అంటూ తన గురువు గారి గురించి డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube