తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో నవంబర్ 30వ తారీకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.నవంబర్ 28వ తారీకు ప్రజారానికి చివరి తేదీ.
దీంతో ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.తెలంగాణలో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత మూడోసారి జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో.పోటాపోటీ హోరహోరిగా ఉంది.
ప్రధానంగా కేసీఆర్( cm kcr ) పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య.గట్టి పోటీ ఉన్నట్లు సర్వే లలో ఫలితాలు వస్తున్నాయి.
దీంతో ఎవరికి వారు ప్రజలకు హామీలు ఇచ్చుకుంటూ మరోపక్క ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కు 48 గంటల ముందే మద్యం దుకాణాలు మూసివేయాలని అబ్కారీ శాఖ కమిషనర్ ఆదేశించారు.ఈనెల 28, 29, 30 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైన్స్ లు, బార్లు మూసివేయాలని స్పష్టం చేశారు.1279 వైన్ షాపులు( Wine shops ) సమస్యాత్మకమైనవిగా గుర్తించామని పేర్కొన్నారు.ఈ ఆదేశాలతో డిసెంబర్ మొదటి తారీఖున మళ్లీ మధ్యం దుకాణాలు తిరిగి తెరుచుకోనున్నాయి.తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున నగదు పట్టుబడుతూ ఉన్నాయి.
చాలావరకు చివరి దశకు ప్రచారం చేరుకోవడం జరిగింది.దీంతో బహిరంగ సభలలో రోడ్డు షోలలో.
ప్రధాన పార్టీల నాయకులు ప్రసంగాలు సంచలనంగా మారుతున్నాయి.