శిరీష(బర్రెలక్క) ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. వాళ్లకు ఇష్టం లేకుండా నామినేషన్ వేశారా?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలోకి వచ్చిన వాళ్లలో శిరీష(బర్రెలక్క)( shirisha ) ఒకరు.గతంలో షేర్ చేసిన ఒక వీడియో ద్వారా శిరీష ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు.

 Shirisha Assets Value Details Here Goes Viral In Social Meida Details Here , S-TeluguStop.com

శిరీష కుటుంబ సభ్యులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడగా హైకోర్టు శిరీషకు భద్రత కల్పించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.దాడి గురించి శిరీష స్పందిస్తూ నేను ఓట్లు చీల్చుతాననే భయంతో కొందరు నాపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.

నా తమ్ముడిపై దాడికి పాల్పడింది ఏ పార్టీ వారో నాకు తెలుసని శిరీష చెప్పుకొచ్చారు.ఆ పార్టీ పేరును నేను వెల్లడించనని ప్రాణం పోయిన వెనుకడుగు వేయనని శిరీష వెల్లడించారు.అధికార పార్టీ వాళ్లు, నాలుగైదు సార్లు గెలిచిన వాళ్లు నన్ను చూసి భయపడుతున్నారని శిరీష కామెంట్లు చేశారు.అందువల్లే రౌడీ మూకలతో నాపై దాడికి ప్రయత్నిస్తున్నారని శిరీష అభిప్రాయం వ్యక్తం చేశారు.

నాకు మద్దతుగా ప్రచారం చేస్తున్న మధు అనే అన్నను సాఫ్ట్ వేర్ జాబ్ నుంచి తొలగించారని శిరీష కామెంట్లు చేశారు.నాకు అండగా నిలుస్తున్న వారిని బెదిరిస్తున్నారని అయినా నేను భయపడనని శిరీష అన్నారు.ఇప్పుడు నేను ఒక్క అడుగు వెనక్కి తగ్గినా భవిష్యత్తులో వెయ్యి అడుగులు వెనక్కు వేసినదానిని అవుతానని ఆమె తెలిపారు.యువతకు ఇది తప్పుడు సంకేతం అవుతుందని శిరీష వెల్లడించారు.

శిరీష తన ఆస్తుల విలువ కేవలం 6500 అని వెల్లడించారు.చేతిలో 5,000 రూపాయల నగదు ఉందని బ్యాంకులో 1500 రూపాయలు ఉన్నాయని శిరీష అన్నారు.

శిరీష చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో( Social media ) వైరల్ అవుతున్నాయి.ఎన్నికల్లో శిరీష విజయం సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.

శిరీష ఎన్నికల్లో విజయం సాధిస్తే యువతలో చాలామంది ఎన్నికల్లో పోటీపై ఆసక్తి చూపే ఛాన్స్ అయితే ఉంది.శిరీష నామినేషన్( Sirisha Nomination ) వేయడం ఆమె అమ్మకు ఇష్టం లేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube