గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్( AP CM Jagan ) వివిధ ఆర్దిక అభియోగాలలో ప్రదాన ముద్దాయిగా ఉన్న విషయం తెలిసిందే.ఆ దిశగా ఆయన 16 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు.
ఆ తర్వాత బెయిల్ దొరకడం, ఎన్నికల ప్రచారం, గెలిచి ముఖ్యమంత్రి అవ్వడం ఇలా వరుస పరిణామాలు జరిగి ప్రస్తుతం ఆయన సుదీర్ఘకాలం గా బెయిల్ పై కొనసాగుతున్న వ్యక్తిగా నిలిచారు.కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ తిరుగులేని మెజారిటీ ఉండటంతో రాజకీయ పరిణామాలు కూడా ఆయనకు అనుకూలంగా కలిసి వచ్చి ఆయనకు న్యాయస్థానంలో ఊరట దక్కుతుందని ప్రచారం కూడా ఉంది.
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా,
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్ కు వ్యతిరేకత బాగా పెరిగిందని , ఆయన ప్రజా మద్దతును కోల్పోయారని ప్రతిపక్షాల ప్రచారం చేస్తున్నాయి .మరోపక్క వివిద కారణాలతో ఆయనకు అతిపెద్ద శత్రువుగా అవతరించిన రెబల్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు( Raghurama Krishnam Raju ) ఆయన బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలని , కేసులను తొందరగా విచారించాలని సుప్రీంకోర్టులో( Supreme Court ) పిటిషన్ దాఖలు చేయడం, దాన్ని సుప్రీంకోర్టు ఆమోదించడంతో ఇప్పుడు కథ మరింత రసవత్తరం గా మారినట్టు తెలుస్తుంది.
ఒక వేళ సుప్రీంకోర్టు తీర్పు కనుక రఘు రామ రాజు కి అనుకూలం గా వస్తే రానున్న ఆరు నెలల కాలంలో జగన్ ఎక్కువ సమయం కోర్టులకు హాజరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది .దాంతో పార్టీ నిర్వహణ, ప్రచారంలో వైసిపి( YCP ) వెనుకబడుతుంది అన్న అంచనాలు ఉన్నాయి .తెలుగుదేశం పార్టీలోలాగే( TDP ) వైసీపీలో కూడా జగన్ కేంద్రంగానే రాజకీయాలు నడుస్తాయి.ఏ నిర్ణయం అయినా ఆయన తీసుకోవాల్సిందే.
అలాంటప్పుడు ఆయన తన సమయాన్ని న్యాయస్థానాలు చుట్టూ తిరగడానికి కేటాయిస్తే తెలుగుదేశం లాగే వైసిపి కూడా తీవ్ర ఇబ్బందులు కూడా అవకాశం ఏర్పడుతుంది.
అదేవిధంగా వచ్చే ఎన్నికల తర్వాత ఫలితాలు కనుక వైసిపి అనుకూలం గా రాకపోతే ఆయన కేసుల విషయంలో మరొకసారి జైలుకు వెళ్లాల్సిన పరిస్తితి కూడా ఉంటుందన్న విశ్లేషణలు వస్తున్నాయి.తమ కు అవసరం ఉంటేనే మోది షా ల దయ ఉంటుందని లేకపోతే మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు .మరి తమ పార్టీ బీఫామ్ పై గెలిచిన అభ్యర్ధి వల్లే చివరికి జైల్ కి కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం అది అత్యంత విచిత్రమైన రాజకీయ పరిణామం గానే చూడాల్సి వస్తుంది.