మరణం అనేది జీవితంలో సహజమైన, అనివార్యమైన భాగం.మరణం ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఉనికికి ముగింపుగా నిలుస్తుంది.
బంధుమిత్రులలో సంబంధాలను తెంచుతుంది.మరణించిన వారి జీవితాన్ని గౌరవించటానికి, గుర్తుంచుకోవడానికి, ప్రజలు సాధారణంగా అంత్యక్రియలను నిర్వహిస్తారు.
అంత్యక్రియలు( Funeral ) అనేది గౌరవప్రదమైన వేడుక, ఇక్కడ మరణించిన వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులు వారి చివరి నివాళులర్పించేందుకు సమావేశమవుతారు.
వారు వారి వారి సంస్కృతి, మతం ప్రకారం వివిధ ఆచారాలు, సేవలను నిర్వహిస్తారు.
అయితే తాజాగా ఒక ఫ్యునరల్‌లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఓ మహిళ అంత్యక్రియల్లో ర్యాంప్ వాక్( Ramp Walk ) చేసింది.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.అది చూసి సోషల్ మీడియాలో పలువురు స్టన్ అవుతున్నారు.
@toota_shayar అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ వీడియోను పోస్ట్ చేసింది.

ఈ వీడియో ఓపెన్ చేస్తే మనకు బిగుతైన దుస్తులు, స్టైలిష్ టోపీని ధరించి ఒక మహిళ ( Woman ) అంత్యక్రియల హాలులోకి ప్రవేశిస్తున్నట్లు కనిపిస్తుంది.ఆమె ఫ్యాషన్ రన్‌వేలో ఉన్నట్లుగా, నడుస్తూ కెమెరాకు పోజులిచ్చింది.అంతేకాదు తన ముందే ఉన్న శవపేటిక వద్దకు వెళ్లి చనిపోయిన వ్యక్తికి ముద్దు పెట్టింది.
అంత్యక్రియలకు హాజరైన వారు తమ ప్రియమైన వ్యక్తిని కోల్పోయినందుకు సంతాపం చెందడానికి బదులుగా ఆమె చిత్రాలు, వీడియోలను తీయడం కనిపిస్తుంది.ఈ వీడియో అంత్యక్రియలను అంగరంగ వైభవంగా మార్చింది.

ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 53 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.లక్షలలో లైక్‌లు కూడా వచ్చాయి.చాలా మంది ఈ వీడియోపై తమ అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానిస్తున్నారు.వారిలో కొందరు మహిళ అనుచితమైన ప్రవర్తన, వస్త్రధారణను వెక్కిరించారు.మరికొందరు ఆమె స్థానంలో ఉంటే లేదా వారి బంధువుల అంత్యక్రియలలో ఆమెను చూస్తే ఎలా స్పందిస్తారని చమత్కరించారు.కొంతమంది వీడియో నిజమైనది కాకపోవచ్చని, అది అంత్యక్రియల థీమ్‌తో ప్రదర్శించబడిన ఒక ఫ్యాషన్ షో( Fashion Show ) అయ్యుండొచ్చని ఊహించారు.
ఏది ఏమైనా ఈ వీడియోలో నుంచి విషయాలు చూసి చాలామంది అవాక్కవుతున్నారు.మీరు కూడా దీన్ని చూసేయండి.







