బుల్లితెర యాంకర్ అరియానా గ్లోరీ( Ariyana Glory ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆర్జీవీ ఇంటర్వ్యూల ద్వారా, బిగ్ బాస్ షో(Bigg Boss Show ) ద్వారా పాపులర్ అయిన అరియానా ఈ మధ్య కాలంలో కొన్ని ఫోటోలలో బొద్దుగా కనిపించడంతో కొంతమంది ఆంటీ అంటూ కామెంట్లు చేశారు.
అయితే ఆంటీ అని కామెంట్ చేసేవాళ్ల నోర్లను అరియానా మూయించారు.స్లిమ్ లుక్ లో దర్శనమిచ్చిన అరియానా ఆ లుక్ తో ఆకట్టుకున్నారు.

గ్రీన్ టాప్, టైట్ ఫిట్ జీన్స్ లో అరియానా మెప్పించారు.అరియానా లేటెస్ట్ లుక్స్ కు నెటిజన్ల నుంచి పాజిటివ్ మార్కులు పడుతున్నాయి.ఇకపై అరియానా గురించి నెగిటివ్ గా కామెంట్ చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.సరైన కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే అరియానాకు ఇండస్ట్రీలో తిరుగుండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

అందాల ఆరబోతతో హీరోయిన్లకు అరియానా గ్లోరీ గట్టి పోటీ ఇస్తున్నారు.అరియానా ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.10 లక్షల మంది అరియానాను ఫాలో అవుతున్నారు.పీపుల్ నన్ను ఎలా జడ్జ్ చేసినా ఐ డోంట్ కేర్ అని ఆమె అన్నారు.
అరియానా ఫోజు బ్యూటిఫుల్ ఫోజ్ అని కొంతమంది కామెంట్లు చేస్తుండగా అరియానా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.అరియానా పోస్ట్ కు 30 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
అరియానా కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని, వివాదాస్పద పోస్ట్ లకు ఆమె దూరంగా ఉండాలని నెటిజన్లు చెబుతున్నారు.ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడితే అరియానా రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని నెటిజన్లు చెబుతున్నారు.
అరియానా రెమ్యునరేషన్ పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది.







