డెల్టా ఎయిర్‌లైన్స్‌కు( Delta Airlines ) చెందిన పైలట్ తనకు అట్లాంటా ఎయిర్‌పోర్ట్‌లో దొరికిన ఓ లైబ్రరీ పుస్తకాన్ని( Library Book ) తిరిగి ఇవ్వడం ద్వారా పుస్తకాలపై తన ప్రేమను చాటుకున్నాడు.ఆయన పేరు బెన్.
“వాట్ ఎవర్ ఆఫ్టర్: ఇఫ్ ది షూ ఫిట్స్” అనే పేరుతో ఉన్న ఆ పుస్తకం అట్లాంటా నుంచి ఏకంగా 1600 కి.మీ కంటే దూరంలో ఉన్న కాన్సాస్‌లోని జాన్సన్ కౌంటీ లైబ్రరీకి( Johnson County Library ) చెందినది.ఈ విషయం తెలిసినా, అంత దూరం పంపించడం కొంచెం కష్టమైనా బెన్ పుస్తకాన్ని తిరిగి లైబ్రరీకి మెయిల్ చేశాడు, దానితో పాటు అతను దానిని ఎలా చూశాడో, దానిని ఎందుకు తిరిగి ఇవ్వాలని తాను నిర్ణయించుకున్నాడో కూడా ఒక లేఖ ద్వారా వివరించాడు.

తనకు 18వ, 19వ శతాబ్దపు చరిత్ర, నావల్ హిస్టారికల్ ఫిక్షన్స్ చదవడం అంటే చాలా ఇష్టమని చెప్పాడు.పుస్తకాన్ని( Book ) లైబ్రరీ నుంచి తీసుకొని పొరపాటున పోగొట్టుకున్న వ్యక్తి కూడా ప్యాషనేట్ రీడర్‌గా ఎదగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.పుస్తకంతో తమ జీవితాన్ని సుసంపన్నం చేసుకున్నందుకు ఎవరికీ జరిమానా విధించకూడదని అతను అన్నాడు.
రీడర్ లేట్ ఫీజు కట్టాల్సి వస్తే అది తాను కట్టడానికి రెడీ అని పైలట్( Pilot ) ఆఫర్ ఇచ్చాడు.యువ సందర్శకులకు లైబ్రరీ కోసం కొన్ని “డెల్టా కిడ్డీ పైలట్ వింగ్స్, ట్రేడింగ్ కార్డ్స్” కూడా పంపాడు.

జాన్సన్ కౌంటీ లైబ్రరీ బెన్ బుక్ రిటన్ ఇవ్వడమే కాక మంచి లేఖ రాసినందుకు సంతోషించింది.అతని లేఖ, పుస్తకం చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది.అతని దాతృత్వానికి, రీడింగ్ హ్యాబిట్స్‌ను ప్రోత్సహించినందుకు అతనికి కృతజ్ఞతలు తెలిపింది.చాలా మంది పోస్ట్‌పై వ్యాఖ్యానించారు.బెన్( Ben ) దయతో కూడిన చర్యకు ప్రశంసించారు.ఆ బుక్‌ను తిరిగి పంపే ముందు తాను చదివాడా? అని కొందరు సందేహం వ్యక్తం చేశారు.పుస్తక రచయిత్రి సారా మ్లినోవ్స్కీ కూడా పోస్ట్‌ని చూసి బెన్‌కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కథ తనకు నచ్చిందని, లైబ్రరీకి, రీడర్‌కి, బెన్‌కి కొన్ని పుస్తకాలను పంపిస్తానని ఆమె చెప్పింది.







