శాంసంగ్( Samsung ) నుంచి శాంసంగ్ గెలాక్సీ బుక్ 4 సిరీస్ ల్యాప్ టాప్ 2024 ఆరంభంలో మార్కెట్లోకి లాంచ్ అవ్వనుంది.ఈ ల్యాప్ టాప్ కు సంబంధించిన స్పెసిఫికేషన్ల వివరాలు కొన్ని ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి అవి ఏమిటో చూద్దాం.

శాంసంగ్ నుంచి గెలాక్సీ బుక్ 4, గెలాక్సీ బుక్ 4 360, గెలాక్సీ బుక్ 4 360 ప్రో, గెలాక్సీ బుక్ 4ప్రో, గెలాక్సీ బుక్ 4 అల్ట్రా అనే ఐదు మోడల్ల ల్యాప్ టాప్స్ మార్కెట్లో విడుదల అవ్వన్నాయి.ఇవన్నీ ఆమోలెట్ డిస్ ప్లే లతో వస్తాయి.ఈ సిరీస్ ల్యాప్ టాప్ మోడల్ లు గెలాక్సీ బుక్ 3 లైన్ అప్ కి కొనసాగింపుగా లాంచ్ అవుతాయి.

శాంసంగ్ గెలాక్సీ బుక్ 4( Samsung Galaxy Book 4 ) సిరీస్ ల్యాప్ టాప్స్ అన్నీ కూడా ఇంటెల్ ప్రాసెసర్లతో పనిచేస్తాయి.Windows 11 OS పై చేస్తాయి.ఈ బేస్ గెలాక్సీ బుక్ 4 మినహా అన్ని మోడల్ లు అమోలెడ్ డిస్ ప్లే, బ్లూ టూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉంటాయి.2 పోర్ట్, రెండు థండర్ బోల్ట్ 4పోర్టులు, ఒక HDMI, మైక్రో SD కార్డ్ రీడర్ లతో ఉంటాయి.మైక్రోఫోన్ లేదా హెడ్ ఫోన్ కోసం కంబైన్డ్ పోర్ట్ ఉంటుంది.గెలాక్సీ బుక్ 4 అల్ట్రా, లైనప్ లో టాప్- ఎండ్ మోడెల్ గా ఉంది.
Nvidia GeForce 4070 GPU ను కలిగి ఉంటుంది.గెలాక్సీ బుక్ 4 360, గెలాక్సీ బుక్ 4 360 ప్రో ల్యాప్ టాప్స్ 360 డిగ్రీల కీలు, పెన్ మద్దతును కలిగి ఉంటాయి.
అవి యాంటీ రిఫ్లెక్టివ్ డిస్ ప్లే కోటింగ్ తో వస్తాయి.గెలాక్సీ అన్ ప్యాక్డ్ 2024 ఈవెంట్ జనవరిలో యూఎస్ లో జరుగనుంది.
ఈ ఈవెంట్ లో గెలాక్సీ బుక్ 4 సీరీస్ ల్యాప్ ట్యాప్ లను ఆవిష్కరించే అవకాశం ఉంది.







