హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీగా నగదు పట్టివేత

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నగదు భారీగా పట్టుబడింది.గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ.5 కోట్లను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 Huge Cash Seizure In Gachibowli, Hyderabad-TeluguStop.com

నగదుతో పాటు మూడు సెల్ ఫోన్స్, ఒక కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు మొత్తం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఎన్నికల నేపథ్యంలో డబ్బు పంచేందుకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ నగదు పార్టీకి చెందిన డబ్బుగా పోలీసులు భావిస్తున్నారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డబ్బుకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube